విద్యాశాఖ కార్యదర్శిగా వాకాటి కరుణ

రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణను విద్యాశాఖ కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. రాష్ట్ర అదనపు ఎన్నికల ప్రధానాధికారి జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ను చేనేత, జౌళిశాఖ కార్యదర్శిగా స్థానచలనం కల్పించింది.

Updated : 20 May 2022 05:43 IST

చేనేత జౌళి శాఖకు జ్యోతి బుద్ధ ప్రకాశ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణను విద్యాశాఖ కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. రాష్ట్ర అదనపు ఎన్నికల ప్రధానాధికారి జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ను చేనేత, జౌళిశాఖ కార్యదర్శిగా స్థానచలనం కల్పించింది. ఈ రెండు బదిలీలతో పాటు అయిదుగురు ఐఏఎస్‌లకు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశ్‌కు రవాణాశాఖ కమిషనర్‌గానూ బాధ్యతలు అప్పగించింది. సీఎం కార్యాలయ కార్యదర్శి రాహుల్‌బొజ్జాకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌, సర్వే సెటిల్‌మెంట్‌ డైరెక్టర్‌గా, వి.శేషాద్రికి సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా, సయ్యద్‌ అలీ ముర్తజారిజ్వీకి ఔషధ నియంత్రణ శాఖ కమిషనర్‌గా, సందీప్‌కుమార్‌ సుల్తానియాకు పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని