Chennai: చెన్నైకు డీఆర్‌ఎస్‌ దెబ్బ..

అంపైర్‌ తప్పిదం, డీఆర్‌ఎస్‌ పని చేయకపోవడం చెన్నై కొంప ముంచాయి. తొలి ఓవర్‌ రెండో బంతికే కాన్వేను కోల్పోయిన ఆ జట్టు ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది...

Published : 13 May 2022 07:12 IST

ముంబయి: అంపైర్‌ తప్పిదం, డీఆర్‌ఎస్‌ పని చేయకపోవడం చెన్నై కొంప ముంచాయి. తొలి ఓవర్‌ రెండో బంతికే కాన్వేను కోల్పోయిన ఆ జట్టు ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. సామ్స్‌ బౌలింగ్‌లో కాన్వేను అంపైర్‌ ఎల్బీగా ప్రకటించాడు. కానీ బంతి లెగ్‌సైడ్‌ వెళ్లేదన్నది స్పష్టం. బ్యాట్స్‌మన్‌కు సమీక్ష కోరే అవకాశం లేకపోయింది. సాంకేతిక సమస్య వల్ల డీఆర్‌ఎస్‌ అందుబాటులో లేదని అంపైర్లు చెప్పడంతో కాన్వే నిరాశగా వెనుదిరిగాడు. రెండో ఓవర్లో ఎల్బీగా వెనుదిరిగిన ఉతప్పకు కూడా సమీక్ష కోరే అవకాశం లేకపోయింది. 1.4 ఓవర్ల తర్వాత డీఆర్‌ఎస్‌ అందుబాటులోకి వచ్చింది. ఓ ఫ్లడ్‌లైట్‌ టవర్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడమే డీఆర్‌ఎస్‌ పనిచేయకపోవడానికి కారణమని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని