Gmail: జీమెయిల్ నుంచి వాయిస్‌ మెసేజ్‌.. ఇదిగో ఇలా పంపొచ్చు

జీమెయిల్ ఎక్కువ మంది సమాచార మార్పిడికి ఉపయోగించే ఈ - మెయిల్ సర్వీస్‌. అయితే జీమెయిల్ నుంచి మెయిల్ మాత్రమే కాదు, వాయిస్‌ మెసేజ్‌లు పంపొచ్చు. మరి అదెలానో తెలుసుకుందాం. 

Published : 24 Dec 2021 14:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వాయిస్‌ మెసేజ్‌.. మనం ఇతరులతో పంచుకునే సమాచారాన్ని టైప్ చేయకుండా మాటలను రికార్డ్ చేసి సులువుగా మెసేజ్‌ చేసేస్తాం. అయితే మెసేజింగ్ యాప్‌లు అందుబాటులోకి వచ్చాక ఒక్క క్లిక్‌తో వాయిస్‌ మెసేజ్‌లు పంపేస్తున్నాం. అలానే ఈ-మెయిల్‌ సేవల మాధ్యమం జీమెయిల్ నుంచి కూడా వాయిస్ మెసేజ్‌లను పంపొచ్చు. జీమెయిల్‌ నుంచి మెయిల్ పంపినట్లుగానే వాయిస్‌ మెసేజ్‌లను పంపొచ్చు. దీనివల్ల అవతలి వ్యక్తులు మీ వాయిస్‌ వినడంతోపాటు.. మీరు వారితో మాట్లాడుతున్న అనుభూతి కలుగుతుంది. మరి జీమెయిల్‌ నుంచి వాయిస్‌ మెసేజ్‌లు ఎలా పంపవచ్చనేది తెలుసుకుందాం. 


అటాచ్‌ ఫైల్ 

మీ ఫోన్‌లో వాయిస్‌ రికార్డింగ్ యాప్‌ ఓపెన్‌ చేసి అందులో మీరు పంపాలనుకుంటున్న సమాచారాన్ని రికార్డ్ చేయాలి. తర్వాత జీమెయిల్ ఓపెన్ చేసి అటాచ్‌ ఫైల్‌లో మీరు రికార్డ్ చేసి వాయిస్‌ ఫైల్‌ను అటాచ్ చేయాలి. తర్వాత సెండ్ బటన్‌ క్లిక్ చేస్తే మీ వాయిస్ మెసేజ్‌ అవతలి వారికి చేరుతుంది. 


రెవెర్బ్‌ (ReVerb)

జీమెయిల్ ద్వారా వాయిస్‌ మెసేజ్‌లు పంపేందుకు ఉన్న మరో ఆప్షన్‌ రెవెర్బ్‌. ఇదో వెబ్ సర్వీస్‌. ఇందులో వాయిస్‌ మెసేజ్‌లను రికార్డ్ చేసి వాటి లింక్‌లను జీమెయిల్ ద్వారా ఇతరులతో షేర్ చేయొచ్చు. అవతలి వారు వాయిస్‌ మెసేజ్‌ ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోకుండానే వినొచ్చు. ఇందుకోసం బ్రౌజర్‌లో రెవెర్బ్‌ ఓపెన్ చేయాలి. తర్వాత రికార్డ్ బటన్‌పై క్లిక్ చేస్తే మైక్రోఫోన్ అనుమతి కోరుతుంది. దాన్ని ఓకే చేసి మీరు పంపాలనుకుంటున్న సమాచారాన్ని రికార్డ్ చేయాలి. అందులో ఎలాంటి తప్పులు లేవనుకుంటే దాన్ని రికార్డ్‌ చేయాలి. ఒకవేళ ఏవైనా తప్పులుంటే డిలీట్ చేసి కొత్త మెసేజ్‌ను రికార్డ్ చేయాలి. తర్వాత సదరు మెసేజ్‌ ఎంబేడ్ లింక్‌ కాపీ చేసి జీమెయిల్‌లో పేస్ట్ చేయాలి. తర్వాత మెయిల్ అందిన వ్యక్తి లింక్‌పై క్లిక్ చేయగానే రివెర్బ్‌ సైట్‌కు రీడైరెక్ట్ అవుతుంది. అందులో మెసేజ్‌ వినొచ్చు.  


మోట్‌ (Mote)

మోట్ ఎక్స్‌టెన్షన్ సాయంతో కూడా జీమెయిల్‌ నుంచి వాయిస్‌ మెసేజ్‌లు పంపొచ్చు. ఇందుకోసం క్రోమ్ బ్రౌజర్‌ నుంచి మోట్‌ ఎక్స్‌టెన్షన్‌ను డౌన్‌లోడ్ చేయాలి. తర్వాత మోట్ ఐకాన్‌ జీమెయిలో సెండ్‌ బటన్‌ పక్కనే కనిపిస్తుంది. జీమెయిల్ ఓపెన్‌ చేసి కంపోజ్‌పై క్లిక్‌ చేయాలి. తర్వాత మోట్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేసి మీ వాయిస్‌ మెసేజ్‌ రికార్డ్ చేయాలి. మెసేజ్ రికార్డ్ చేయడం పూర్తయ్యాక తిరిగి మోట్‌ ఐకాన్‌పై క్లిక్ చేస్తే మెసేజ్ రికార్డింగ్ ఆగిపోతుంది. తర్వాత వాయిస్‌ మెసేజ్‌తో ఉన్న మోట్‌ కార్డ్ మీ జీమెయిల్‌కు యాడ్ అవుతుంది.

వాయిస్‌ మెసేజ్‌ పంపే ముందు వినాలనుకున్నా, డిలీట్ చేయాలన్నా, ఎడిట్‌ చేయాలన్నా మోట్ కార్డ్ పక్కనే ఉన్న మూడు డాట్స్‌పై క్లిక్ చేయాలి. ఎడిటింగ్ పూర్తయ్యాక సెండ్ బటన్‌ క్లిక్ చేస్తే వాయిస్‌ మెసేజ్‌ వెళ్లిపోతుంది. మీరు మెసేజ్‌ పంపిన వ్యక్తి కూడా మోట్ ఉపయోగిస్తుంటే మీ మెసేజ్‌ మెయిల్‌లోనే వినగలుగుతారు. లేకుంటే మెసేజ్‌పై క్లిక్ చేయగానే మోట్‌ వెబ్‌సైట్ ఓపెన్‌ అవుతుంది. అందులో వాయిస్ మెసేజ్ వినొచ్చు. ఈ ఎక్స్‌టెన్షన్‌ ఉచిత వెర్షన్‌లో కేవలం 30 సెకన్ల నిడివి ఉన్న వాయిస్ మెసేజ్‌లను మాత్రమే రికార్డ్ చేసి పంపగలం. సబ్‌స్క్రిప్షన్ వెర్షన్‌లో 90 సెకన్ల వాయిస్‌ మెసేజ్‌లతోపాటు, వాయిస్‌-టు-టెక్ట్స్‌ ట్రాన్‌క్రిప్షన్‌ వంటి ఫీచర్స్ అదనంగా ఉంటాయి. 


వోకల్‌ (Vocal)

జీమెయిల్‌ ద్వారా వాయిస్ మెసేజ్‌లు పంపేందుకు మరో ఆప్షన్‌ అందుబాటులో ఉంది. వోకల్ అనే గూగుల్ క్రోమ్‌ ఎక్స్‌టెన్షన్‌ ద్వారా కూడా జీమెయిల్‌ నుంచి వాయిస్ మెసేజ్‌లు పంపొచ్చు. ఇందుకోసం క్రోమ్ బ్రౌజర్‌లో వోకల్ ఎక్స్‌టెన్షన్‌ను డౌన్‌లోడ్ చేయాలి. తర్వాత కంప్యూటర్‌ స్క్రీన్‌ కింద టూల్‌బార్‌లో  మైక్రోఫోన్ సింబల్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే మీ కంప్యూటర్‌లోని మైక్రోఫోన్‌ అనుమతి కోరుతూ మెయిల్ విండో ఓపెన్ అవుతుంది. దానికి మీరు అనుమతించిన తర్వాత మూడు సెకన్ల నిడివితో టైమర్ కనిపిస్తుంది. టైమర్‌ పూర్తయిన తర్వాత బీప్‌ శబ్దం వినిపిస్తుంది. తర్వాత మన వాయిస్‌ మెసేజ్‌ రికార్డింగ్ ప్రారంభమవుతుంది.

ఇందులో 60 సెకన్ల నిడివి గల వాయిస్‌ మెసేజ్‌ను ఉచితంగా రికార్డ్ చేసుకోవచ్చు. రికార్డింగ్ పూర్తయిన తర్వాత మీ మెసేజ్‌ను విని అటాచ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే వాయిస్‌ మెసేజ్‌ అవతలి వారికి చేరుతుంది. ఒకవేళ మీ మెసేజ్‌లో మరింత సమాచారం చేర్చాలనుకుంటే రికార్డ్ చేసిన మెసేజ్‌ను డిలీట్ చేసి కొత్తగా వాయిస్‌ రికార్డింగ్ ప్రారంభించవచ్చు. ఈ ఎక్స్‌టెక్షన్‌ ద్వారా ఉచితంగా వారానికి 100 మెసేజ్‌లను రికార్డ్ చేసుకోవచ్చు. అపరిమిత రికార్డింగ్ ఫీచర్‌, సంతకంతో కూడిన మెసేజ్‌ వంటి ఫీచర్లు కావాలంటే మాత్రం సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సిందే. 

Read latest Gadgets & Technology News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని