Youtube: సొంతంగా వీడియోలు రూపొందించడంమానేస్తున్న యూట్యూబ్!
కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ వినియోగం భారీగా పెరిగింది. దీంతో ఓటీటీ సంస్థలన్నీ సొంతంగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు నిర్మిస్తున్నాయి. అయితే, ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ సంస్థ యూట్యూబ్ మాత్రం షోలు, సినిమాల నిర్మాణం నుంచి తప్పుకోనున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇకపై ‘యూట్యూబ్ ఒరిజినల్స్’ ద్వారా
ఇంటర్నెట్ డెస్క్: కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ వినియోగం భారీగా పెరిగింది. దీంతో ఓటీటీ సంస్థలన్నీ సొంతంగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు నిర్మిస్తున్నాయి. అయితే, ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ సంస్థ యూట్యూబ్ తన ‘ఒరిజినల్స్’ విభాగం ద్వారా నిర్మించే షోలు, సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టనున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇకపై సొంతగా వెబ్‌సిరీస్‌లు, సినిమాలు, విద్యకు సంబంధించిన వీడియోలు, మ్యూజిక్, సెలబ్రిటీల షోలను నిర్మించబోమని యూట్యూబ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రాబర్ట్ ప్రకటించారు.
అయితే, ‘యూట్యూబ్ కిడ్స్’.. ‘బ్లాక్ వాయిసెస్’ కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తామని యూట్యూబ్ ప్రతినిధులు వెల్లడించారు. యూట్యూబ్‌లో 2020లో ప్రారంభించిన ‘బ్లాక్ వాయిస్’ కార్యక్రమాన్ని మరింత విస్తరింపజేసేందుకు 100 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.
ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ వేగవంతంగా వృద్ధి చెందుతుండటంతో కొత్త అవకాశాలు వస్తున్నాయి. దీంతో యూట్యూబ్ తన పెట్టుబడులను షోలు, సినిమా నిర్మాణంపై కాకుండా షార్ట్స్, బ్లాక్ వాయిసెస్, లైవ్ షాపింగ్ ప్రోగ్రామింగ్ వంటి కొత్త ప్రాజెక్టులపై పెట్టి క్రియేటర్లను ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తోంది. యూట్యూబ్ ఒరిజినల్స్ గ్లోబల్ హెడ్ సుసాన్ డానియల్స్ త్వరలో కంపెనీ నుంచి తప్పుకోవడమూ ఈ నిర్ణయానికి ఒక కారణంగా తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!
-
Pakistan-New Zealand: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్
-
Law Commission: ‘జమిలి’ నివేదికపై కసరత్తు జరుగుతోంది.. లా కమిషన్ ఛైర్మన్
-
IND vs AUS: టీమ్ఇండియా ఆలౌట్.. మూడో వన్డేలో ఆస్ట్రేలియా విజయం
-
Cheetah : భారత్‌కు ఉత్తర ఆఫ్రికా దేశాల చీతాలు.. పరిశీలిస్తున్న అధికారులు!