Samsung Galaxy F23: శాంసంగ్ నుంచి కొత్త 5జీ ఫోన్.. ఫీచర్లు, ధర వివరాలివే!
గెలాక్సీ ఎఫ్23 స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్‌లో శాంసంగ్ విడుదల చేసింది. ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో ఏయే ఫీచర్లు ఉన్నాయి? ధరెంత?
ఇంటర్నెట్ డెస్క్: శాంసంగ్ ఎప్పటికప్పుడు సరికొత్త మోడళ్లను విడుదల చేస్తూ మొబైల్ ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. తాజాగా బడ్జెట్ రేంజ్‌లో గెలాక్సీ సిరీస్ నుంచి ఎఫ్23ని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. మరి ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో ఏయే ఫీచర్లు ఉన్నాయి? ధరెంతో చూద్దాం..
మొబైల్ స్పెసిఫికేషన్లు..
గెలాక్సీ ఎఫ్23 స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. తొలిసారిగా ఎఫ్ సిరీస్ డివైజ్‌లో 120హెర్జ్ రిఫ్రెష్ రేటుతో ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో తీసుకొస్తున్నారు. 6.4 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. వెనుకవైపు 50ఎంపీ, 8ఎంపీ, 2ఎంపీ కెమెరాలను అమర్చారు. సెల్పీల కోసం 8ఎంపీ కెమెరాను ఇస్తున్నారు. ఇది 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో 25వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు చేస్తుంది.
4జీబీ+120జీబీ వేరియంట్ గల ఫోన్ల ధరను రూ.17,499గా ఉండగా.. 6జీబీ+128జీబీ వేరియంట్ ఫోన్ల ధరను రూ.18,499గా నిర్ణయించారు. అయితే, ప్రారంభ ఆఫర్ కింద ఈ రెండు వేరియంట్ల ధరను రూ.14,999గా.. రూ.15,499గా నిర్ణయించారు. అంతేకాకుండా ఐసీఐసీఐ బ్యాంకు కార్డుతో రూ.1000 క్యాష్‌బ్యాక్‌ను కూడా ఇస్తున్నారు. గెలాక్సీ ఎఫ్23 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు మార్చి 16 నుంచి శాంసంగ్ డాట్ కామ్, ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయానికి అందుబాటులో ఉండనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Jairam Ramesh : మణిపుర్ వెళ్లేందుకు మోదీకి ఒక్కరోజు కూడా వీలు కాలేదా?: కాంగ్రెస్
-
Nepal Cricket: కార్డియాక్ కిడ్స్... వీళ్ల స్ట్రోక్‌లు మామూలుగా ఉండవ్!
-
Uttar pradesh: ఫిర్యాదు చేసేందుకు వచ్చిన దళిత యువతిపై.. పోలీసు అత్యాచారం
-
Asian Games: ఆసియా క్రీడలు.. షూటింగ్లో పతకాల పంట
-
Leo: ‘లియో’ ఆడియో ఫంక్షన్ క్యాన్సిల్.. అసలు కారణమిదే..
-
S Jaishankar: ఈ ప్రశ్న అడగాల్సింది నన్ను కాదు..: కెనడా వివాదంపై జైశంకర్ ఘాటు రిప్లై