Windows 11: విండోస్ 11లో ఈ ఫీచర్ల గురించి తెలుసా?
విండోస్ 11లో ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కొత్త ఫీచర్లేంటో, అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకుందామా..
మైక్రోసాఫ్ట్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) విండోస్ 11ను గతేడాది అక్టోబరులో అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే, విండోస్ 11లో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ వస్తోంది. మరి విండోస్ 11లో కొత్త ఫీచర్లేంటో, అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకుందామా..
➤ టాస్క్‌బార్‌లో కొత్తగా..
మైక్రోసాఫ్ట్ విండోస్ 11 వెర్షన్లో కొత్తగా లొకేషన్ ఆధారంగా వాతావరణ సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీనిపై క్లిక్ చేయగానే వాతావరణ వివరాలను తెలిపే విడ్జెట్ ప్యానెల్ ఓపెన్ అవుతోంది. ఈ ఫీచర్ ఎనెబుల్ చేసుకోవాలంటే..
టాస్క్‌బార్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి వెథర్ విడ్జెట్స్ (Weather Widgets)ను ఎనెబుల్ చేసుకోగానే వాతావరణ సమాచారం టాస్క్‌బార్‌లో ప్రత్యక్షం అవుతోంది.
➤ మైక్‌ను మ్యూట్/అన్‌మ్యూట్ చేసుకొండిలా..
విండోస్ 11 అప్‌గ్రేడ్ అయిన సిస్టమ్స్‌లో టాస్క్‌బార్‌లో కుడి పక్కగా ఉన్న మైక్‌ను మ్యూట్/అన్‌మ్యూట్ చేసుకోవడానికి ఇక ప్రత్యేకంగా దాన్ని ఓపెన్ చేయాల్సిన పనిలేదు. దీనికోసం ఒక షార్ట్ కట్ కీ “Windows + Alt + K” ని కూడా తీసుకొచ్చింది. దీంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు మైక్‌ను మ్యూట్/అన్‌మ్యూట్ చేసుకోవచ్చు.
➤ వాయిస్ టైపింగ్..
మనం టైప్ చేసే అవసరం లేకుండా విండోస్‌లో వాయిస్ టైపింగ్ ఫీచర్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో మనం చెప్పాలనుకున్న విషయాన్ని నేరుగా వాయిస్ రూపకంగా చెప్పొచ్చు. దీనికోసం షార్ట్ కట్ కీ “Windows + H” నొక్కగానే వాయిస్ టైపింగ్ కమాండ్ ఓపెన్ అవుతోంది.
➤ పాత కాంటెక్ట్స్ మెనూ కావాలా?
విండోస్ 10 నుంచి విండోస్ 11 వెర్షన్‌కు అప్‌గ్రేడ్ అయినట్లయితే పాత కాంటెక్ట్స్ మెనూలో మార్పులు జరుగుతాయి. దీంతో కొన్ని సెట్టింగ్స్ పోయాయని కొందరు భావిస్తారు. ఇక ఎప్పటిలాగే వాటిని మరలా యాక్సెస్ చేసుకునేలా విండోస్ 11 ఓఎస్‌ను అప్‌గ్రేడ్ చేసింది. దీనికోసం చిన్న ట్రిక్ ఉపయోగించాల్సి ఉంటుంది. కాంటెక్ట్స్ మెనూలో డబుల్ క్లిక్ చేసి “Show More Options”కి వెళ్లాలి. లేదంటే “Shift + F10” అనే షార్ట్‌కట్‌ను ఉపయోగించి పాత ఫీచర్లను డైరెక్ట్‌గా ఓపెన్ చేయవచ్చు.
➤ ఆండ్రాయిడ్ యాప్ సపోర్ట్
విండోస్ 11లో ఆండ్రాయిడ్ యాప్స్ సపోర్ట్ కోసం మైక్రోసాఫ్ట్ ప్రత్యేకమైన సాంకేతికతను తీసుకొచ్చింది. అమెజాన్ సంస్థ భాగస్వామ్యంతో మైక్రోసాఫ్ట్ ఈ కొత్త తరహా ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం అమెజాన్ యాప్ స్టోర్‌లో ఆండ్రాయిడ్ యాప్స్, గేమ్స్ పరిమిత సంఖ్యలోనే ఉన్నాయి. ఇవి కాకుండా విండోస్ 11లో ‘ఇన్స్టాల్ గూగుల్ ప్లే స్టోర్’ నుంచీ యాప్స్, గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
➤ స్టార్ట్ మెనూతో ఫోల్డర్స్ తెరవచ్చు..
విండోస్ 11లో స్టార్ట్ మెనూతో డైరెక్ట్‌గా మనం క్రియేట్ చేసుకున్న ఫోల్డర్లను తెరవచ్చు. మైక్రోసాఫ్ట్ తాజాగా డెస్క్‌టాప్ ఓఎస్‌లో స్టార్ట్ సెట్టింగ్‌లో ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. స్టార్ట్ మెనూలోని ఫోల్డర్లతో మీడియా ఫైల్స్‌ను, డౌన్లోడ్స్, ఇతరత్రా డాక్యుమెంట్లను యాక్సెస్ చేయవచ్చు.
ఈ ఫీచర్‌ను కోసం.. Settings -> Personalization -> Start page -> Folders ను ఎనెబుల్ చేసుకుంటే సరిపోతుంది.
➤ రీడిజైన్ ఎమోజీ పికర్..
విండోస్ 11లో 3డీ ఎమోజీస్ అందుబాటులోకి రాలేదు కానీ, మైక్రోసాఫ్ట్ తాజాగా ఎమోజీ పికర్‌ను రీడిజైన్ చేసింది. “Windows + ” అనే షార్ట్ కట్ కీని ఉపయోగించి వీటిని ఇక నేరుగా ఓపెన్ చేయవచ్చు. స్నేహితులతో వాట్సాప్ వెబ్‌లో గానీ, ఇతరత్రా మెసేజింగ్ సర్వీస్లల్లో చాటింగ్ చేస్తున్నపుడు సులువుగా పంపడానికి వీలుగా మైక్రోసాప్ట్ వీటిని రూపొందించింది.
➤ షేక్ చేస్తే మినిమైజ్..
మనం సిస్టమ్‌లో పని నిమిత్తం చాలా విండోలను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. మనకు కావాల్సిన విండోను మరలా తెరవాలంటే మిగతా వాటిని మినిమైజ్ చేయాల్సి ఉంటుంది. దీనికి చాలా టైం వేస్ట్ అవుతోంది. అలా కాకుండా ఉండటం కోసం విండోస్ 11లో ఓ ప్రత్యేకమైన ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇంపార్టెంట్ అనుకున్నా విండోపై ఫోకస్ చేయడానికి షేక్ టు మినిమైజ్ అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీన్ని ఎనెబుల్ చేసుకోవడం కోసం.. Settings -> System -> Multitasking లోకి వెళ్లి టైటిల్ బార్ విండోస్ షేక్ అనే ఆప్షన్‌ను టర్న్ అన్ చేస్తే సరిపోతుంది.
➤ ఒక్కో యాప్ ఒక్కోలా సౌండ్..
విండోస్ 11లో ఒక్కో యాప్‌లో ఒక్కో రకంగా సౌండ్ సెట్ చేసుకునేలా వాల్యూమ్ మిక్సర్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీన్ని ఎనెబుల్ చేయడానికి Settings -> System -> Sound -> Volume mixerపై క్లిక్ చేయాలి. ఇందులో మనకు కావాల్సిన యాప్‌లో ఎంత మేర సౌండ్ ఉండాలో సెటప్ చేసుకోవాలి.
➤ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నట్టుగానే..
స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నట్టుగానే ల్యాప్‌టాప్ యూజర్లకు విండోస్ 11లోనూ డ్యాష్‌బోర్డులో స్క్రీన్ టైంను చూసుకునే ఫీచర్‌ను మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చింది. స్క్రీన్ ఆన్/ ఆఫ్ టైం, స్లీప్ టైప్ లాంటి వాటిని చెక్ చేసుకునే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఏ యాప్స్‌కు ఎక్కువగా బ్యాటరీ వృథా అవుతుందనే విషయం తెలుసుకోవడంతో పాటు సిస్టమ్ బ్యాటరీ లైఫ్‌ను కాపాడుకునేందుకు వీలుగా ఈ ఫీచర్ ఉపయోగపడుతోంది.
గమనిక: ఈ ఫీచర్లు ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు. ప్రయోగాత్మకంగా కొంతమందికే ఈ సౌకర్యాలు అందిస్తున్నారు. త్వరలో అందరూ వాడొచ్చు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెదడులాంటి కంప్యూటర్!
మనిషి మెదడులా పనిచేసే, ఒకే సమయంలో వేర్వేరుగా స్పందించే కంప్యూటర్లను రూపొందించాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ దిశగా ఇంటెల్ శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద న్యూరోమార్ఫిక్ కంప్యూటర్ను రూపొందించారు. -
దైవకణం కథ
అది అన్ని కణాలకూ ద్రవ్యరాశిని సంతరింపజేస్తుంది. దీని గురించి 1960ల్లోనే తెలిసినా 50 ఏళ్ల తర్వాత గానీ ఉనికి బయటపడలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద, అతి సంక్లిష్ట యంత్రం సాయం తీసుకుంటే తప్ప అది సాధ్యం కాలేదు. -
కాల మహిమ
ఉగాది రోజు పంచాంగం విన్నారా? దీనిలోని తిథులు, రోజులు, పక్షాలు, నెలలు, రుతువులు.. అన్నీ కాల గమన సంకేతాలే. అసలు కాలమంటే ఏంటి? అది ఎలా మొదలైంది? ఇలాగే కొనసాగుతుందా? అంతమవుతుందా? -
కంప్యూటర్‌కు బుర్ర!
మన మెదడు అద్భుతమైంది. హేతుబద్ధంగా వ్యవహరిస్తుంది. కార్య కారణాలను విశ్లేషించి ఒక నిర్ణయానికి వస్తుంది. ఉచితానుచితాలను బేరీజు వేస్తుంది. ఏ పని ఎలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో పసిగడుతుంది. -
ఫోన్ ట్యాప్ అయ్యిందా?
నేటి డిజిటల్ యుగంలో వ్యక్తిగత సమాచార గోప్యత, భద్రత అతి కీలకమయ్యాయి. అధునాతన నిఘా పద్ధతుల నేపథ్యంలో ఇవి మరింత ప్రాధాన్యం సంతరించు కుంటున్నాయి. నిత్య జీవితంలో విడదీయలేని పరికరంగా మారిన ఫోన్ల మీదా నిఘా వేయటం, ట్యాపింగ్ చేయటమూ చూస్తున్నాం. -
రోబో సేవలు చేసేనే..
మనిషికి మనిషి తోడంటారు. ఇప్పుడు మర మనిషీ (రోబో) చేయందిస్తోంది. ఒకపక్క అధునాతన హ్యూమనాయిడ్ రోబోల వెల్లువ సంచలనం సృష్టిస్తుండగా.. మరోపక్క మామూలు రోబోలూ సేవలకు సిద్ధమవుతున్నాయి. -
మానవ రోబో దండు!
రోబో అనగానే ఏం గుర్తుకొస్తుంది? లోహ చట్రంతో కదిలే మర యంత్రమో, కదిలే లోహం బొమ్మో మదిలో కదలాడుతుంది. రబ్బరు కండరాలతో చేసినదైతే మనిషి మాదిరిగానూ కనిపిస్తుంది. చూపు, మాట మనిషిని పోలి ఉంటాయి. -
paul alexander: ఇనుప ఊపిరితిత్తి!
ఓ పొడవైన పెట్టె. శరీరమంతా అందులోనే. తల మాత్రమే బయటకు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 72 ఏళ్లు అందులోనే గడిపితే? అమెరికాకు చెందిన పాల్ అలెగ్జాండర్ అలాగే గడిపారు -
గూగుల్ సెర్చ్ తెలివిగా..
స్మార్ట్ఫోన్లలో గూగుల్ సెర్చ్‌ను వాడనివారుండరంటే అతిశయోక్తి కాదు. కానీ తేలికగా, త్వరగా ఆయా అంశాలను శోధించటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయనే సంగతి తెలుసా? అలాంటి కొన్ని ఉపాయాల గురించి తెలుసుకుందాం. -
భళారే డిజిటల్ విచిత్రం!
ఒకప్పటి కన్నా స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల సామర్థ్యం, వేగం పుంజుకున్న మాట నిజం. కానీ ఆకారంలో పెద్దగా మారింది లేదు. ఒకసారి అంచులు చిన్నగా.. మరోసారి కెమెరా బంప్‌లు పెద్దగా ఉండటం తప్పించి దాదాపు అలాగే కనిపిస్తుంటాయి. -
కృత్రిమ మేధ గుండె కాయ
కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎక్కడ చూసినా ఈ పేరే మార్మోగుతోంది. -
ఇక ఏఐ సినిమా!
పదాల కూర్పు ఆధారంగా చిటికెలో ఫొటోలు, చిత్రాలు, సంగీతం, పాటలను పుట్టిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) మరో అడుగు ముందుకేసింది. ఏకంగా వీడియోలనూ సృష్టించే స్థాయికి చేరుకుంది. విప్లవాత్మక ఛాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్ఏఐ సంస్థ కొత్తగా తీసుకొచ్చిన జనరేటివ్ కృత్రిమ మేధ (జెన్ఏఐ) మోడలే దీనికి నిదర్శనం. -
ఈ విశ్వ కిరణాలు..
విశ్వ కిరణాలు.. కాస్మిక్ రేస్. అంతరిక్షం ఆవలి నుంచి దూసుకొచ్చే ఇవి నిరంతరం అతి వేగంగా.. దాదాపు కాంతి వేగంతో సమానంగా విశ్వమంతటా ప్రయాణిస్తుంటాయి. వీటి మీద మొదటి నుంచీ శాస్త్రవేత్తలకు ఎంతో ఆసక్తి. ఎందుకంటే అంతరిక్షంలో పుట్టుకొచ్చిన చోటు, ఢీకొట్టిన వస్తువులను బట్టి ఇవి విశ్వానికి సంబంధించిన ఎన్నో విషయాలను వివరిస్తాయి. -
ప్రేమ శాస్త్రం!
ప్రేమ ఎందుకు పుడుతుందో, ఎవరి మీద పుడుతుందో తెలియదు. ఒకరికి నచ్చిన వ్యక్తి మరొకరికి నచ్చకపోవచ్చు. ఒకరికి అసలే నచ్చనివారు మరొకరికి ప్రాణం కన్నా మిన్నగా అనిపించ్చొచ్చు. -
ఫోల్డర్ మాయలు
విండోస్ పీసీలో రోజూ ఫోల్డర్లను వాడుతూనే ఉంటాం. కొత్త ఫైళ్లను స్టోర్ చేయటం, డేటాను వరుసగా పెట్టుకోవటం.. ఇలా ఎన్నింటికో వీటిని ఉపయో గిస్తుంటాం. మరి అదృశ్య ఫోల్డర్‌ను సృష్టించుకోగలరా? ఒకేసారి బోలెడన్ని ఫోల్డర్ల పేర్లను మార్చుకోగలరా? ఖాళీ ఫోల్డర్లను గుర్తించగలరా? ఇలాంటి కొన్ని చిత్రమైన ఫోల్డర్ చిట్కాల గురించి తెలుసుకుందాం. -
అమెజాన్ అడుగున బంగారు నేల
అమెజాన్ అనగానే దట్టమైన అడవులే గుర్తుకొస్తాయి. మనుషులు దూరటానికి వీల్లేని అక్కడ ఒకప్పుడు పెద్ద పట్టణమే ఉండేదని ఇటీవల తేలటం అందరినీ ఆశ్చర్యపరచింది -
ఏఐ టెక్కులు!
అసలే కృత్రిమ మేధ (ఏఐ) యుగం. ఆపై ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్ వస్తు ప్రదర్శన. ఇక చెప్పేదేముంది? ఏ పరికరాన్ని చూసినా ఏఐమయమే. హెల్త్ ట్రాకర్ల దగ్గరి నుంచి వాహనాల వరకూ అన్నింటికీ అదే ఆలంబన. -
Cyber Crime: నయా సైడర్!
నేటి సైబర్ యుగంలో నేరాలూ మారిపోతున్నాయి. ఆన్లైన్ మోసాలు కోకొల్లలు. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు చోరీ చేసి మన ప్రమేయమేమీ లేకుండానే నేరగాళ్లు షాపింగ్ చేయటం తెలిసిందే -
కొత్త టెక్ లోకం
డిజిటల్ పరిణామం ఆగేది కాదు. ఇదో నిరంతర ప్రక్రియ. గత ఏడాదిని గతి తిప్పిన ట్రెండ్స్ కొత్త సంవత్సరాన్నీ పరుగులు తీయించనున్నాయి. మెషిన్ ఇంటెలిజెన్స్ జోరందుకోనుంది. వాస్తవ, కాల్పనిక ప్రపంచాల మధ్య హద్దులు చెరగటం ఖాయంగా కనిపిస్తోంటే.. నిరంతర అంతర్జాల పరిణామ ప్రక్రియ మన జీవితాలను గణనీయంగా శాసించేలా రూపుదిద్దుకుంటోంది. -
ఇస్రో ఏఐ వత్సరం 2024
ఇది మనదేశం జాబిల్లిని తాకి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచిన సంవత్సరం.ఇది కృత్రిమ మేధ ప్రయోగశాలలను దాటుకొని నిత్య జీవన వ్యవహారాల్లోకి విరివిగా చొచ్చుకొచ్చిన సంవత్సరం.శాస్త్ర, సాంకేతిక రంగాలు ఒకదాంతో మరోటి పోటీ పడుతూ కొత్త వత్సరంలోకి అడుగిడుతున్న వేళ సాధించిన ఘనతలను సమీక్షించుకోవటం ముదావహం. -
స్థానిక మేధ
కృత్రిమ మేధ (ఏఐ) తీరు మారుతోంది. ఆంగ్లం గడపను దాటుకొని స్థానిక భాషలపై దృష్టి సారిస్తోంది. ఆయా భాషల వైవిధ్యం, యాసలు, సంస్కృతులకు అనుగుణంగా రూపాంతరం చెందుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా