మైక్రోమ్యాక్స్‌ మాయ

పంచ్‌-హోల్‌ సెల్ఫీ కెమెరా.. ఆధునిక లుక్‌తో మైక్రోమ్యాక్స్‌ ‘ఇన్‌1’ స్మార్ట్‌ఫోన్‌ని పరిచయం చేయనుంది....

Published : 17 Mar 2021 00:51 IST

పంచ్‌-హోల్‌ సెల్ఫీ కెమెరా.. ఆధునిక లుక్‌తో మైక్రోమ్యాక్స్‌ ‘ఇన్‌1’ స్మార్ట్‌ఫోన్‌ని పరిచయం చేయనుంది. తెర పరిమాణం 6.67 అంగుళాలు. అంచుల వరకూ తాకేతెర ఆకట్టుకుంటుంది. వెనక మూడు కెమెరాలు ఉన్నాయి. దీర్ఘచతురస్రాకారపు ప్యానల్‌లో ఫ్లాష్‌లైట్‌తో పాటు కెమెరాలు నిక్షిప్తమై ఉన్నాయి. MediaTek Helio G80 SoC ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 6జీబీ. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 128జీబీ. బ్యాటరీ సామర్థ్యం 5,000ఎంఏహెచ్‌. 18వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టు ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని