ఊపిరితిత్తులపై ఒమిక్రాన్ ప్రభావం తక్కువే!
ఒమిక్రాన్ రకం ఊపిరితిత్తులపై చాలా తక్కువ ప్రభావం చూపుతోందని, లక్షణాలు ఎగువ శ్వాసకోశ వ్యవస్థకే పరిమితం అవుతున్నాయని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) వైద్యులు స్పష్టం చేశారు.
బాధితులు 3-4 రోజుల్లోనే కోలుకుంటున్నారు
మార్చి చివరికి ఎండమిక్‌గా కరోనా రూపాంతరం
ఏఐజీ వెబినార్‌లో డాక్టర్ నాగేశ్వరరెడ్డి, ఇతర వైద్యులు
ఈనాడు, హైదరాబాద్: ఒమిక్రాన్ రకం ఊపిరితిత్తులపై చాలా తక్కువ ప్రభావం చూపుతోందని, లక్షణాలు ఎగువ శ్వాసకోశ వ్యవస్థకే పరిమితం అవుతున్నాయని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) వైద్యులు స్పష్టం చేశారు. చాలామందిలో స్వల్ప లక్షణాలే ఉంటున్నాయని పేర్కొన్నారు. 95 శాతం మంది 3-4 రోజులకే కోలుకుంటున్నారని, వైరస్ స్పైక్ ప్రొటీన్‌లో భారీ స్థాయిలో జరిగిన ఉత్పరివర్తనాల వల్ల వ్యాప్తి అధికంగా ఉంటోందన్నారు. మూడో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో ఒమిక్రాన్ లక్షణాలు.. చికిత్సలు తదితర విషయాలపై శుక్రవారం ఏఐజీ ఆసుపత్రి యాజమాన్యం వెబినార్ నిర్వహించింది. ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ మూడో దశలో ఆసుపత్రిలో చేరికలు, మరణాలు తక్కువ స్థాయిలో ఉన్నాయన్నారు. ఒమిక్రాన్ ఎంత వేగంగా వ్యాపిస్తోందో.. అంతే వేగంగా తగ్గిపోతోందన్నారు. మార్చి నెల అంతానికి ఎండమిక్ స్థాయికి చేరి, సాధారణ దగ్గు, జలుబు లక్షణాలకే పరిమితం కావొచ్చన్నారు. అయినా, నిర్లక్ష్యం వహించక అందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. బూస్టర్ డోసుతో వ్యాధి నిరోధక శక్తి పెరిగి స్పైక్ ప్రొటీన్‌ను నియంత్రిస్తుందన్నారు. వైరస్ సోకినా స్వల్ప లక్షణాలే కన్పిస్తాయన్నారు.
ఆ లక్షణాలు ఉంటే డెల్టా రకమే
ఒమిక్రాన్‌లో సాధారణ జలుబు, పొడి దగ్గు, ముక్కు కారటం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, నీరసం, గొంతు నొప్పి లాంటి లక్షణాలు కన్పిస్తున్నాయని డాక్టర్ శశికళ తెలిపారు. టీకా గ్రహీతల్లో టి-సెల్స్‌లోని వ్యాధి నిరోధకత కరోనా స్పైక్ ప్రోటీన్‌ను గుర్తించి అడ్డుకుంటోందన్నారు. తద్వారా చాలామంది రక్షణ పొందుతున్నారన్నారు. కొందరిలో 5 రోజులు దాటినా జ్వరం తగ్గకపోవడం, వాసన, రుచి పోవడం, ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం లాంటి లక్షణాలు ఉంటే మాత్రం అది డెల్టా వేరియంట్‌గానే భావించాలని డాక్టర్ కేతన్ తెలిపారు. మనిషి నుంచి కరోనా వైరస్ ఎలుకలు, ఒంటె, మేక తదితర జంతువులకు చేరి ఉత్పరివర్తనం చెంది తిరిగి మనుషులకు సోకడం వల్ల ఒమిక్రాన్‌లో ఎక్కువ మ్యుటేషన్లు ఉంటున్నాయని పాథాలజీ వైద్యులు డాక్టర్ అనురాధ శేఖరన్ వివరించారు. పల్మనాలజిస్టు డాక్టర్ విశ్వనాథ్ గెల్లా మాట్లాడుతూ తాజాగా అందుబాటులోకి వచ్చిన పలు యాంటీ వైరల్ ఔషధాలు అధిక రిస్క్ ఉన్న రోగుల్లో ఉత్తమ ఫలితాలే ఇస్తున్నాయన్నారు. రెండు డోసుల టీకాతోపాటు బూస్టర్ డోసు తీసుకొని ఉంటే.. యాంటీబాడీల పరీక్ష తర్వాతే కాక్టెయిల్ వినియోగంపై నిర్ణయం తీసుకోవాలన్నారు. పలువురు ఇతర వైద్యులూ మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్‌భవన్‌లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్‌ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్‌లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్‌కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్‌ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరామర్శించారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్‌పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
యూటీఎస్ యాప్ పరిధి పెంపు
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్‌కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్‌కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్‌లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్‌లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్‌లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు. -
ఏఈ పోస్టుల జనరల్ ర్యాంకు జాబితా వెల్లడి
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. -
డీజీపీ రవిగుప్తాకు పరిహారం చెల్లించండి
పనిచేయని రిక్లైనర్ సీటును కేటాయించి తీవ్ర అసౌకర్యం కలిగించడం, బిజినెస్(జెడ్) క్లాస్ టికెట్లో ఎకానమీ క్లాస్ సేవలందించిన నేపథ్యంలో డీజీపీ దంపతులకు రూ.2,07,500 పరిహారం చెల్లించాలని సింగపూర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్‌కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-3 ఆదేశించింది. -
సౌత్‌జోన్ డీసీపీగా స్నేహామెహ్రా
హైదరాబాద్‌లోని దక్షిణ మండలం డీసీపీగా స్నేహామెహ్రాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రాత్రి బాధ్యతలు స్వీకరించారు. -
ఖానాపూర్ అడవుల్లో చిరుత సంచారం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ రేంజి పరిధిలో నీటి వనరుల చెంత వన్యప్రాణులు కనిపించాయి. -
కాళేశ్వరంపై సత్వర విచారణ
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టుపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ తెలిపారు. -
మండుతున్న ఎండలు.. భగ్గుమంటున్న అడవులు
రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్ దాటుతోంది.