Huzurabad By Election: ఎమ్మెల్యేగా తిరిగొస్తావ్‌

‘హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధిస్తుంది. భారీ మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా హైదరాబాద్‌కు వస్తావు’ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను ముఖ్యమంత్రి,

Updated : 30 Aug 2022 14:19 IST

హుజూరాబాద్‌ తెరాస కంచుకోట

గెల్లు శ్రీనివాస్‌తో సీఎం కేసీఆర్‌

తెరాస తరఫున బి-ఫారం అందజేత

ఈనాడు, హైదరాబాద్‌: ‘హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధిస్తుంది. భారీ మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా హైదరాబాద్‌కు వస్తావు’ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌ ఆశీర్వదించారు. గురువారం రాత్రి ఆయన గెల్లుకు బి-ఫారం అందజేశారు. మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీమంత్రి పెద్దిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ, ‘హుజూరాబాద్‌ తెరాసకు కంచుకోట. అక్కడ పార్టీకి పటిష్ఠమైన పునాది ఉంది. వ్యక్తులుగా కాకుండా పార్టీగా ఎదిగిన నియోజకవర్గమది. అంకితభావంతో కార్యకర్తలు తమ భుజాలపై జెండా మోస్తున్నారు. పార్టీకి ద్రోహం చేసిన వారికి అక్కడ చోటులేదు. సంక్షేమ కార్యక్రమాలు, ప్రజారంజక పాలనే మన బలం. సర్వేలన్నీ తెరాస గెలుపునే ఖాయం చేస్తున్నాయి మరో పార్టీకి అక్కడ చోటే లేదు’ అని అన్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా హరీశ్‌, ప్రశాంత్‌రెడ్డి, పెద్దిరెడ్డి, గెల్లు శ్రీనివాస్‌తో సీఎం పలు అంశాలపై చర్చించారు. తానూ ఎన్నికల ప్రచారసభలో పాల్గొంటారని వెల్లడించినట్లు సమాచారం. ఎన్నికల ఖర్చు కోసం పార్టీ నిధి కింద రూ.28లక్షల చెక్కు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని