
SBI: సైబర్ నేరగాళ్లు కొట్టేసిన మొత్తాన్ని ఖాతాదారుకు చెల్లించాల్సిందే..
ఎస్‌బీఐకి రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఆదేశం
ఈనాడు, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు కొట్టేసిన సొమ్మును తన ఖాతాదారుకు ఎస్‌బీఐ చెల్లించాల్సిందేనని రాష్ట్ర వినియోగదారుల కమిషన్ తీర్పు వెలువరించింది. కస్టమర్ మోసపోయిన తేదీ నుంచి 9 శాతం వడ్డీ సహా చెల్లించాలంది. సైబరాబాద్ పరిధిలోని చర్లపల్లికి చెందిన ఎం.కె.మిశ్ర ఎస్‌బీఐ నుంచి రూ.3 లక్షలు వ్యక్తిగత రుణం తీసుకున్నారు. ఈ మొత్తాన్ని డ్రా చేసుకునేలోగా ఆయన డెబిట్ కార్డు ఆధారంగా సైబర్ నేరగాళ్లు 2013 మే 5 నుంచి 7 వరకూ రూ.1.46 లక్షలు కాజేశారు. దీనిపై బ్యాంకుతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో మిశ్ర జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. ఈ మొత్తాన్ని 2013 నుంచి వడ్డీ సహా చెల్లించాలంటూ ఫోరం తీర్పునివ్వడంతో ఎస్‌బీఐ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌లో అప్పీలు దాఖలు చేసింది. దీనిపై కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ ఎమ్మెస్కే జైశ్వాల్, సభ్యులు మీనా రామనాథన్, కె.రంగారావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది. ‘‘2012 నుంచి ఖాతాదారు డెబిట్ కార్డు వాడుతున్నారు. రుణం తీసుకున్నాకే అది దుర్వినియోగమైంది. ఫిర్యాదుదారు డెబిట్ కార్డును కేవలం నగదు ఉపసంహరణకు మాత్రమే వినియోగిస్తున్నారు. ఎప్పుడూ కొనుగోళ్లకు ఉపయోగించలేదు. సదరు మూడు రోజుల్లో 132 కొనుగోలు లావాదేవీలు జరిగాయి. ఇన్ని లావాదేవీలు జరుగుతున్నా కనీస సమాచారం, మెసేజ్, ఈ-మెయిల్ వంటివి ఖాతాదారుకు తెలియజేయలేదు’’ అని పేర్కొంది. సైబర్ నేరస్థుడిని కనిపెట్టే ప్రయత్నం చేయకుండా పోలీసులే తేల్చాలంటూ ఎస్‌బీఐ చేతులెత్తేయడాన్ని తప్పుబట్టింది. ఎప్పుడూ పేటీఎం వినియోగించని ఖాతాదారు ఖాతాలోకి దాని ద్వారా రూ.600 జమ అయిందని, వీటన్నింటి ద్వారా మోసం చేసిన వ్యక్తిని బ్యాంకు కనిపెట్టడానికి ప్రయత్నించలేదని ఆక్షేపించింది. సరైన నిఘా, పరిశీలన లేకపోవడంతోనే ఖాతాదారు మోసపోయారని, ఇది బ్యాంకు సేవాలోపమేనంది. బ్యాంకు పిన్ వంటి రహస్యాలను ఇతరులకు చెప్పడం ద్వారానే మోసం జరిగిందన్న బ్యాంకు వాదనను తోసిపుచ్చింది. ఖాతాదారు మోసపోయిన రూ.1.46 లక్షలను 2013 నుంచి 9 శాతం వడ్డీతో చెల్లించాలంటూ జిల్లా ఫోరం ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఎస్‌బీఐ అప్పీలును కొట్టివేసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Boris Johnson: ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా
-
Movies News
Tamannaah: సినీ ప్రియులకు తమన్నా ప్రామిస్.. ఎందుకంటే..?
-
Crime News
Secunderabad Violance: నాకేం తెలియదు.. కావాలనే ఇరికించారు: సుబ్బారావు నోట అదే మాట
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రేసులో రిషి సునాక్.. ఆయన గురించి తెలుసా?
-
India News
PM Modi: ఆ కిచెన్‌లో లక్ష మందికి వంట చేయొచ్చు.. ప్రారంభించిన మోదీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Venu: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి
- Naga Chaitanya: నువ్వే నాకు ప్రేమించడం నేర్పించావ్.. చై ఎమోషనల్ పోస్ట్
- Elon Musk: ఉద్యోగితో మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన మస్క్?
- ప్రసవం తర్వాత.. ఆ భాగం బిగుతుగా మారాలంటే..
- Nagababu: భీమవరం సభలో చిరంజీవి తప్ప మిగిలిన వారి నటన అద్భుతం: నాగబాబు ట్వీట్
- IND vs ENG : ధనాధన్ వేళాయె..
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- పాఠాలు చెప్పలేదని.. రూ.24లక్షల జీతం తిరిగిచ్చేసిన ప్రొఫెసర్
- Rahul Dravid : బజ్‌బాల్ అంటే ఏమిటీ?
- అలుపు లేదు... గెలుపే!