కవ్వాల్‌లో కెమెరా కంటికి చిక్కిన వన్యప్రాణులు

కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు పరిధిలోని జన్నారం అటవీ డివిజన్‌లో పలు రకాల వన్యప్రాణులు కెమెరా కంటికి చిక్కాయి. చిరుతలు, అడవి దున్నలు, జింకలు, ఎలుగుబంట్లు ఇందులో ఉన్నాయి. దాదాపు 60 చిత్రాలు ఉండగా, ఇందులో

Published : 20 May 2022 05:26 IST

ఈనాడు హైదరాబాద్‌: కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు పరిధిలోని జన్నారం అటవీ డివిజన్‌లో పలు రకాల వన్యప్రాణులు కెమెరా కంటికి చిక్కాయి. చిరుతలు, అడవి దున్నలు, జింకలు, ఎలుగుబంట్లు ఇందులో ఉన్నాయి. దాదాపు 60 చిత్రాలు ఉండగా, ఇందులో ఎక్కువగా చీకటివేళలో సంచరిస్తున్నవే ఉన్నాయి. ఈ చిత్రాలు అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వైవిధ్యాన్ని స్పష్టం చేస్తున్నాయి.. అటవీ జీవావరణం పెరిగిందని అటవీశాఖ పేర్కొంది. ఈ చిత్రాల్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి, కేంద్ర పర్యావరణ శాఖకు, ఎన్టీసీఏకు, రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌కి ట్యాగ్‌ చేస్తూ అటవీశాఖ గురువారం ట్వీట్‌ చేసింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని