Published : 21 May 2022 05:39 IST

అమ్రాబాద్‌లో 21 పులులు

ఈనాడు, హైదరాబాద్‌: అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో పెద్ద పులుల గాండ్రింపులు పెరిగాయి. ఆలిండియా టైగర్‌ ఎస్టిమేషన్‌ రిపోర్టు-2021 కోసం పంపిన వివరాల్లో ఇక్కడ మొత్తం 21 పులులు (పిల్లలతో కలిపి) ఉన్నట్లు రాష్ట్ర అటవీశాఖ పేర్కొంది. ఇందులో 10 ఆడవి, 7 మగవి, మరో నాలుగు పిల్ల పులులు ఉన్నట్లుగా అధికారులు స్పష్టం చేశారు. ఫొటోలతో సహా వివరాలు పంపారు. ఈ పులులు నల్లమల అడవుల్లో అటవీశాఖ ఏర్పాటు చేసిన కెమెరాల కంటికి చిక్కాయి. అమ్రాబాద్‌ అభయారణ్యంలో మగ పులుల కంటే ఆడ పులుల సంఖ్య అధికంగా ఉంది. ఎలుగుబంట్లు, చిరుతపులుల సంఖ్య కూడా బాగా పెరిగినట్లు అధికారులు గుర్తించారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా జులై 29న ఆలిండియా టైగర్‌ ఎస్టిమేషన్‌ రిపోర్టు-2021ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఆ వెంటనే పులుల చిత్రాలతో కాఫీ టేబుల్‌ బుక్‌ విడుదల చేయాలని రాష్ట్ర అటవీశాఖ నిర్ణయించింది.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts