‘కరోనా’ వైద్యుల కుటుంబాలకు అండగా ఉంటాం

కరోనా విపత్కర పరిస్థితుల్లో సేవలందిస్తూ ప్రాణాలు కోల్పోయిన వైద్యుల కుటుంబాలకు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) అండగా నిలుస్తుందని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు డా.సహజానంద్‌ ప్రసాద్‌సింగ్‌ తెలిపారు.

Updated : 23 May 2022 05:24 IST

ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డా.సహజానంద్‌ ప్రసాద్‌సింగ్‌

సుల్తాన్‌బజార్‌, న్యూస్‌టుడే: కరోనా విపత్కర పరిస్థితుల్లో సేవలందిస్తూ ప్రాణాలు కోల్పోయిన వైద్యుల కుటుంబాలకు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) అండగా నిలుస్తుందని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు డా.సహజానంద్‌ ప్రసాద్‌సింగ్‌ తెలిపారు. కొవిడ్‌ రోగులకు సేవలందిస్తూ ప్రాణాలు కోల్పోయిన 68 మంది వైద్యుల స్మృత్యర్థం ఐఎంఏ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని కార్యాలయంలో స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డా.ఎం.సంపత్‌రావు, డా.బి.నరేందర్‌రెడ్డి తదితరులతో కలిసి ఆదివారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం ప్రసాద్‌సింగ్‌ మాట్లాడుతూ.. కరోనాపై పోరులో ప్రాణాలు కోల్పోయిన వైద్యుల కుటుంబాలను ఆదుకునేందుకు ఐఎంఏ ప్రత్యేకంగా నిధి ఏర్పాటు చేస్తోందన్నారు. ఇప్పటివరకు సుమారు రూ.5 కోట్ల మేర సహాయం అందించామన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షులు డా.రవీందర్‌రెడ్డి, ఐఎంఏ రాష్ట్ర శాఖ పూర్వ అధ్యక్షులు డా.ప్రతాప్‌రెడ్డి, డా.లవకుమార్‌రెడ్డి, డా.నర్సింగారెడ్డి, ఐఎంఏ బిల్డింగ్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ డా.కృష్ణారెడ్డి, డా.ఉమాకాంత్‌గౌడ్‌, డా.ప్రభావతి, డా.లింగమూర్తి, డా.దయాళ్‌సింగ్‌, డా.సంజీవ్‌సింగ్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని