Ticket Reservation: ప్రయాణానికి 15 నిమిషాల ముందూ రిజర్వేషన్‌!

దూర ప్రాంతాలకు సంబంధించి బస్సు బయల్దేరడానికి 15 నిముషాల ముందు కూడా టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకునే విధానాన్ని త్వరలో తీసుకురానున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ గురువారం

Published : 27 May 2022 08:19 IST

తెలంగాణ ఆర్టీసీ సరికొత్త ప్రయోగం

ఈనాడు, హైదరాబాద్‌: దూర ప్రాంతాలకు సంబంధించి బస్సు బయల్దేరడానికి 15 నిముషాల ముందు కూడా టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకునే విధానాన్ని త్వరలో తీసుకురానున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం బస్సు బయల్దేరడానికి గంట ముందుగానే రిజర్వేషన్‌ సదుపాయ సమయం ముగుస్తుంది. బస్సులో సీట్లు ఖాళీ ఉన్న పక్షంలో డ్రైవర్‌/కండక్టర్‌ను సంప్రదించి నగదు రూపంలో చెల్లించి టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక నుంచి ఆ ఇబ్బందిని తొలగించనున్నారు. దూర ప్రాంత బస్సుల్లో సీట్లు ఖాళీగా ఉంటే బయల్దేరడానికి 15 నిముషాల ముందు కూడా డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేసే సదుపాయాన్ని తీసుకువచ్చేందుకు ఆధునిక సాంకేతికతతో పనిచేసే యంత్రాలను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. తొలిదశలో 928 యంత్రాలను కొనుగోలు చేస్తామని, త్వరలోనే ఆ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలను అందించే క్రమంలో స్మార్ట్‌ కార్డును తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ విధానంలో ప్రయాణికులకు రివార్డు పాయింట్స్‌ సదుపాయం కల్పిస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని