ఆ అధికారం దిగువ కోర్టులకు లేదు

ఇరుపక్షాల మధ్య లోక్‌అదాలత్‌లో కుదిరిన రాజీ ఒప్పందాన్ని (అవార్డును) రద్దు చేసే అధికారం కింది కోర్టులకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. రాజీ ఒప్పందంపై ఎవరికైనా అభ్యంతరాలుంటే అధికరణ 226, 227 కింద కేవలం హైకోర్టును ఆశ్రయించాలని పేర్కొంది.

Published : 29 May 2022 05:19 IST

లోక్‌అదాలత్‌ అవార్డు రద్దుపై హైకోర్టు స్పష్టీకరణ

ఈనాడు, హైదరాబాద్‌: ఇరుపక్షాల మధ్య లోక్‌అదాలత్‌లో కుదిరిన రాజీ ఒప్పందాన్ని (అవార్డును) రద్దు చేసే అధికారం కింది కోర్టులకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. రాజీ ఒప్పందంపై ఎవరికైనా అభ్యంతరాలుంటే అధికరణ 226, 227 కింద కేవలం హైకోర్టును ఆశ్రయించాలని పేర్కొంది. హైకోర్టు జోక్యం కూడా పరిమితికి లోబడి ఉంటుందని పేర్కొంది. భార్యాభర్తల మధ్య 2006లో కుదిరిన లోక్‌అదాలత్‌ అవార్డును రద్దు చేస్తూ వరంగల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఉత్తర్వులు ఇవ్వగా.. వాటిని సవాలు చేస్తూ భర్త హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఎ.వెంకటేశ్వరరెడ్డి విచారణ చేపట్టారు. వివిధ కేసుల్లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుల ప్రకారం లోక్‌అదాలత్‌ అవార్డులను కేవలం హైకోర్టుల్లోనే సవాలు చేయాల్సి ఉందన్నారు. అది కూడా కొన్ని పరిమితులకు లోబడి ఉంటుందన్నారు. లోక్‌అదాలత్‌లో కుదిరిన రాజీ ఒప్పందాన్ని వరంగల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి పరిధి దాటి రద్దు చేయడం చెల్లదన్నారు. రాజీ ఒప్పందాన్ని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఒప్పందంపై అభ్యంతరాలుంటే ప్రతివాది హైకోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని