రాజన్న ఆలయంలో సిరా ప్రసాదం

దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం నుంచి కొత్తగా సిరా ప్రసాద విక్రయాలు మొదలుపెట్టారు. ప్రసాద పంపిణీ కేంద్రాన్ని ఆలయ ఈవో రమాదేవి లాంఛనంగా

Published : 27 Jun 2022 03:48 IST

వేములవాడ, న్యూస్‌టుడే: దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం నుంచి కొత్తగా సిరా ప్రసాద విక్రయాలు మొదలుపెట్టారు. ప్రసాద పంపిణీ కేంద్రాన్ని ఆలయ ఈవో రమాదేవి లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పటి వరకు రాజన్న భక్తులకు లడ్డూ ప్రసాదం, పులిహోర మాత్రమే అందుబాటులో ఉన్నాయి. భక్తుల విజ్ఞప్తి మేరకు సిరా ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. 100 గ్రాముల సిరా ప్రసాదాన్ని రూ.20లకు విక్రయిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని