41 ఎస్సీ గురుకులాల్లో 100% ఫలితాలు

ఇంటర్‌ ఫలితాల్లో గురుకులాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. రాష్ట్రస్థాయి ఉత్తీర్ణత సగటు కంటే గురుకులాల్లో  సుమారు 25 శాతం ఎక్కువగా ఉంది. సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీకి చెందిన 41 కళాశాలల్లో వందశాతం ఫలితాలు నమోదయ్యాయి.

Published : 29 Jun 2022 04:24 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ ఫలితాల్లో గురుకులాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. రాష్ట్రస్థాయి ఉత్తీర్ణత సగటు కంటే గురుకులాల్లో  సుమారు 25 శాతం ఎక్కువగా ఉంది. సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీకి చెందిన 41 కళాశాలల్లో వందశాతం ఫలితాలు నమోదయ్యాయి.

ద్వితీయ సంవత్సరంలో  93.23 శాతం, ప్రథమ సంవత్సరంలో 88.03 శాతం ఉత్తీర్ణులయ్యారు.

* మహాత్మా జ్యోతిబాఫులే బీసీ గురుకుల సంస్థ విద్యార్థులు ద్వితీయ సంవత్సర పరీక్షల్లో 93.84శాతం, మొదటి సంవత్సరం 84.81శాతం ఉత్తీర్ణత సాధించారు. 

* గిరిజన సంక్షేమ గురుకులాల సొసైటీలో   82.09శాతం ఉత్తీర్ణత నమోదైంది.

* ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో  94.18శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం ఏడు కళాశాలలకుగాను రెండు కళాశాలల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారు.

* రాష్ట్రంలో 172 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో(కేజీబీవీల్లో) ఇంటర్‌ సెకండియర్‌లో 86.64 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.  ప్రథమ సంవత్సరంలో  81.02 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్‌లో 14, సెకండియర్‌లో 16 కేజీబీవీల్లో 100 శాతం మంది పాసయ్యారు. 

* తెలంగాణ రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల(టీఆర్‌ఈఐ) పరిధిలోని 35 టీఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాలల నుంచి 2,742 మంది పరీక్షలు రాయగా  2,674 మంది ఉత్తీర్ణులయ్యారని, 97.21 శాతం మంది పాసయ్యారని ఆ సొసైటీ కార్యదర్శి రమణకుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని