గోదావరి పరీవాహకంలో ప్రవాహం

కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరికి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. శ్రీరాంసాగర్‌కు ఎగువ నుంచి వరద ఎక్కువవుతోంది. మంగళవారం నాటికి 12,963 క్యూసెక్కులు వస్తున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న మధ్యతరహా ప్రాజెక్టు కడెంకు భారీ

Published : 06 Jul 2022 05:58 IST

 లక్ష్మీ బ్యారేజీ 30 గేట్ల ఎత్తివేత

కడెం ప్రాజెక్టు దిగువన అప్రమత్తత

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 12,963 క్యూసెక్కుల ప్రవాహం

ఆలమట్టి వద్ద కృష్ణాలో 12,684 క్యూసెక్కులు

ఈనాడు, హైదరాబాద్‌-మహదేవ్‌పూర్‌, న్యూస్‌టుడే: కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరికి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. శ్రీరాంసాగర్‌కు ఎగువ నుంచి వరద ఎక్కువవుతోంది. మంగళవారం నాటికి 12,963 క్యూసెక్కులు వస్తున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న మధ్యతరహా ప్రాజెక్టు కడెంకు భారీ వరద వస్తోంది. ఇది మరింత పెరిగే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక్కడి నుంచి అదనపు వరద అంతా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుతుంది. మరోవైపు ప్రాణహిత, గోదావరి సంగమం వద్ద ఉన్న కాళేశ్వరంలోని మొదటి బ్యారేజీ లక్ష్మీలోకి (మేడిగడ్డ) వరద పెరుగుతోంది. మంగళవారం 60,530 క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. దీంతో 30 గేట్లు తెరిచి 75,890 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. బ్యారేజీలో 16.17 టీఎంసీలకు 9.3 టీఎంసీల నీరు చేరింది. నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు ఎగువ నుంచి ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు ఒక గేటు తెరిచారు. దిగువకు గోదావరిలోకి 3 వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని వదులుతున్నారు. మరికొన్ని గేట్లు కూడా తెరిచే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు కృష్ణా ఎగువ ప్రాజెక్టు ఆలమట్టికి ప్రవాహం ప్రారంభమైంది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు క్రమంగా ప్రవాహం పెరుగుతోంది. తుంగభద్ర ప్రాజెక్టులోకి కూడా నీరు వస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని