TS EAMCET: నేడు తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు.. రిజల్ట్స్‌ ఈనాడు.నెట్‌లో..

తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ విభాగాల ఫలితాలు శుక్రవారం ఉదయం 11.15 గంటలకు విడుదల కానున్నాయి. జేఎన్‌టీయూహెచ్‌ ప్రాంగణంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి

Updated : 12 Aug 2022 10:49 IST

12 గంటలకు ఈసెట్‌ ర్యాంకుల విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ విభాగాల ఫలితాలు శుక్రవారం ఉదయం 11.15 గంటలకు విడుదల కానున్నాయి. జేఎన్‌టీయూహెచ్‌ ప్రాంగణంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేస్తారని కన్వీనర్‌ ఆచార్య గోవర్ధన్‌ తెలిపారు. పాలిటెక్నిక్‌ పూర్తయిన విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్‌, బీఫార్మసీ రెండో ఏడాదిలో చేరేందుకు నిర్వహించిన ఈసెట్‌ ర్యాంకులను మధ్యాహ్నం 12గంటలకు విడుదల చేస్తారని కన్వీనర్‌ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. ఫలితాలు www.eenadu.net, eenadupratibha.net, eamcet.tsche.ac.in, ecet.tsche.ac.in తదితర వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని