అన్నంలో పురుగులు.. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

తమ పిల్లలు తినే మధ్యాహ్న భోజనంలో తెల్ల పురుగులు వస్తున్నాయంటూ కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం చిన ముల్కనూర్‌ మోడల్‌ స్కూల్‌ విద్యార్థుల తల్లిదండ్రులు

Published : 24 Sep 2022 05:12 IST

చిగురుమామిడి, న్యూస్‌టుడే: తమ పిల్లలు తినే మధ్యాహ్న భోజనంలో తెల్ల పురుగులు వస్తున్నాయంటూ కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం చిన ముల్కనూర్‌ మోడల్‌ స్కూల్‌ విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. శుక్రవారం పేరెంట్స్‌ కమిటీ సమావేశం ఏర్పాటు చేయగా.. అన్నంలో పురుగులు, నీళ్ల చారు వల్ల చాలా మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయడం లేదని కొందరు తల్లిదండ్రులు ప్రిన్సిపల్‌ శ్రీనివాస్‌ దృష్టికి తీసుకెళ్లారు. తిన్నవారు కూడా అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి బియ్యాన్ని ఎందుకు వండుతున్నారని వంట మనుషులను నిలదీశారు. ముఖ్యమంత్రి దత్తత గ్రామంలో ఇలా జరగడమేంటని ప్రశ్నించారు. తహసీల్దార్‌, మండల పరిషత్‌ సూపరింటెండెంట్‌, ఎంఈవోలు అక్కడికి చేరుకొని.. నాణ్యమైన బియ్యం సరఫరా చేయిస్తామని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని