సాగు, అటవీ, మత్స్య రంగాల్లో తెలంగాణ అద్భుత ప్రగతి

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన ఎనిమిదేళ్లలో వ్యవసాయం, అటవీ, మత్స్య రంగాల్లో రూ. 1.81 లక్షల కోట్ల విలువైన సంపదను సృష్టించి, అద్భుత ప్రగతిని సాధించినట్లు భారతీయ రిజర్వ్‌

Published : 26 Sep 2022 04:10 IST

తాజా నివేదికలో ఆర్బీఐ పేర్కొందని వినోద్‌కుమార్‌ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన ఎనిమిదేళ్లలో వ్యవసాయం, అటవీ, మత్స్య రంగాల్లో రూ. 1.81 లక్షల కోట్ల విలువైన సంపదను సృష్టించి, అద్భుత ప్రగతిని సాధించినట్లు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) తాజా నివేదికలో వెల్లడించిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2017-18లో రూ. 95,098 కోట్లుగా ఉన్న ఈ మూడు రంగాల ఉత్పత్తుల విలువ 2021-22 నాటికి రూ.1,81,702 కోట్లకు పెరిగిందని చెప్పారు. ఐదేళ్లలో ఈ సంపద విలువ రూ. 86,604 కోట్లు పెరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక చర్యల వల్లే ఈ మూడు రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధ్యమైందని ఆర్బీఐ చెప్పిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిపాలన దక్షతకు ఈ నివేదిక నిలువుటద్దమని పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచే తెలంగాణ ప్రభుత్వం ఈ మూడు రంగాల అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు వివరించారు. రాష్ట్ర ప్రగతిపై ఆర్బీఐ ప్రశంసలు తెలంగాణలోని ప్రతి ఒక్కరికీ గర్వకారణమని, ఈ నివేదిక చూసైనా భాజపా నేతలు తీరు మార్చుకోవాలని ఆయన అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని