దేవనాగరిలోకి.. తెలుగు లిపిలోని సంస్కృత రచనలు

తెలుగు లిపిలోని సంస్కృత రచనలను దేవనాగరి లిపిలోకి మార్చే మహత్తర క్రతువును హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కొనసాగుతున్న సంస్కృత అకాడమీ చేపట్టింది.

Updated : 03 Dec 2022 05:27 IST

సంస్కృత అకాడమీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రాజెక్టు

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు లిపిలోని సంస్కృత రచనలను దేవనాగరి లిపిలోకి మార్చే మహత్తర క్రతువును హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కొనసాగుతున్న సంస్కృత అకాడమీ చేపట్టింది. దిల్లీలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం సౌజన్యంతో ‘అరుదైన పుస్తకాల ప్రచురణల ముద్రణ’ పేరిట ప్రాజెక్టు చేపట్టింది. ప్రస్తుతం తెలుగు, సంస్కృతం తెలిసిన పాఠకులు తక్కువగా ఉన్నారు. ఆయా రచనలను దేవనాగరి లిపిలోకి మార్చితే ఎక్కువమందికి చేరే వీలుంటుందనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. తొలిదశలో 20 పుస్తకాలను ముద్రించగా, తాజాగా మరో మూడేళ్ల కాలానికి రెండో దశ ప్రాజెక్టు మంజూరైంది. ఆయా పుస్తకాలను డిజిటల్‌ రూపంలోనూ భద్రపరుస్తున్నారు.


రెండో దశలో 25 పుస్తకాలు
-ప్రొ.కె.నీలకంఠం, సంస్కృత అకాడమీ సంచాలకులు

తెలుగులిపిలో మన కవులు చేసిన సంస్కృత రచనలు వందల సంఖ్యలో ఉన్నాయి. ఆ సాహిత్య సంపదను భద్రపరిచి ప్రపంచానికి అందించాలన్నదే మా లక్ష్యం. ఈ ఏడాది నుంచి మూడేళ్ల పాటు నడిచే రెండో విడత ప్రాజెక్టు కింద 25 పుస్తకాలను ముద్రించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆయా పుస్తకాలను ఎప్పటికీ పరిరక్షించే ఉద్దేశంతో డిజిటల్‌ రూపంలోకి తీసుకొస్తున్నాం. పీడీఎఫ్‌ రూపంలో వెబ్‌సైట్‌లోనూ నిక్షిప్తం చేస్తున్నాం.


 

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు