తీన్మార్‌ మల్లన్న పాదయాత్రకు షరతులతో హైకోర్టు అనుమతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాదయాత్ర నిర్వహించుకోవడానికి చింతపండు నవీన్‌కుమార్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నకు హైకోర్టు బుధవారం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.

Updated : 08 Dec 2022 09:56 IST

ఈనాడు, హైదరాబాద్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాదయాత్ర నిర్వహించుకోవడానికి చింతపండు నవీన్‌కుమార్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నకు హైకోర్టు బుధవారం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. పాదయాత్రలో వంద మందికి మించి ఉండరాదని, పోడుకు సంబంధించిన వివాదాలపై ప్రసంగాలు చేయరాదని పేర్కొంది. ఇటీవల జరిగిన అటవీ శాఖ అధికారి మృతిపై ఎవరూ మాట్లాడొద్దని షరతు విధించింది. పాదయాత్రకు అనుమతిని తిరస్కరిస్తూ భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ ఇచ్చిన ఉత్తర్వులపై తీన్మార్‌ మల్లన్న.. హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టి షరతులతో అనుమతి ఇచ్చారు. ఈ నెల 11 నుంచి పాదయాత్ర ప్రారంభంకానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని