‘పార్క్‌’.. ఖమ్మం మార్క్‌

ఖమ్మం నగరంలోని గోళ్లపాడు కాల్వ(ఛానల్‌) మార్గం వెంట 11 కిలోమీటర్ల పరిధిలో రూ.100 కోట్లతో పార్కులు సుందరంగా ముస్తాబవుతున్నాయి.

Published : 26 Jan 2023 04:24 IST

ఖమ్మం నగరంలోని గోళ్లపాడు కాల్వ(ఛానల్‌) మార్గం వెంట 11 కిలోమీటర్ల పరిధిలో రూ.100 కోట్లతో పార్కులు సుందరంగా ముస్తాబవుతున్నాయి. గతంలో ఈ ప్రాంతాలు మురికికూపాలను తలపించేవి. వీటిని అందంగా తీర్చిదిద్దాలని, ప్రభుత్వస్థలాలు ఆక్రమణకు గురికాకుండా కాపాడాలనే ఉద్దేశంతో పది పార్కులను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో చిన్నారులకు ఆట పరికరాలు, స్కేటింగ్‌, ఫుట్‌బాల్‌, వాలీబాల్‌ కోర్టులు, ఓపెన్‌ జిమ్‌లు, ఫౌంటెయిన్లు, వాకింగ్‌ ట్రాక్‌లు, ప్రకృతివనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. పార్కుల ముఖద్వారాలపై పక్షులు, జంతువుల బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి. పదికి గాను నాలుగు పార్కుల పనులు పూర్తయ్యాయి. వీటికి తెలంగాణ ప్రముఖుల పేర్లు పెట్టారు. ఉద్యానవనాలను మంత్రి కేటీఆర్‌ ఫిబ్రవరి 10న ప్రారంభించనున్నారు.

 ఈనాడు, ఖమ్మం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని