Chandrabose:‘నాటు నాటు’కి ఆస్కార్‌.. చంద్రబోస్‌ సొంతూరిలో సంబరాలు

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌ అవార్డు సొంతం చేసుకోవడంపై రచయిత కనుకుంట్ల సుభాష్‌ చంద్రబోస్‌ సొంతూరు భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెలో సంబరాలు మిన్నంటాయి.

Updated : 14 Mar 2023 07:23 IST

ఈనాడు డిజిటల్‌-జయశంకర్‌ భూపాలపల్లి, చిట్యాల-న్యూస్‌టుడే: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌ అవార్డు సొంతం చేసుకోవడంపై రచయిత కనుకుంట్ల సుభాష్‌ చంద్రబోస్‌ సొంతూరు భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెలో సంబరాలు మిన్నంటాయి. చంద్రబోస్‌కు ఆస్కార్‌ పురస్కారం రావడంతో మనసు ఉప్పొంగిందని ఆయన తండ్రి, విశ్రాంత ఉపాధ్యాయుడు నర్సయ్య తెలిపారు. ‘‘చిన్నప్పటి నుంచే బోస్‌ శివాలయంలో భజన చేసేవాడు. పాటలు పాడేవాడు. జానపదాలను రాసేవాడు. గాయకుడు కావాలనుకున్నాడు. గేయ రచయితగా రాణిస్తున్నాడు’’ అని పేర్కొన్నారు. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు రావడంతో ఆస్కార్‌ వస్తుందనే ఆశ ఏర్పడిందని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రోతలకు ఈ పురస్కారం చెందుతుందని చంద్రబోస్‌ సతీమణి సుచిత్ర పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు