గవర్నర్‌ వద్ద బిల్లుల పెండింగ్‌ కేసులో కేంద్రానికి సుప్రీం నోటీసులు

శాసనసభ పాస్‌ చేసిన బిల్లులకు ఆమోదం తెలపకుండా గవర్నర్‌ పెండింగ్‌లో పెట్టడాన్ని సవాల్‌చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.

Published : 22 Mar 2023 05:11 IST

ఈనాడు, దిల్లీ: శాసనసభ పాస్‌ చేసిన బిల్లులకు ఆమోదం తెలపకుండా గవర్నర్‌ పెండింగ్‌లో పెట్టడాన్ని సవాల్‌చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. సోమవారం ఈ కేసుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వె.ౖచంద్రచూడ్‌, జస్టిస్‌ పి.శ్రీనరసింహ, జస్టిస్‌ జె.బి.పర్డీవాలాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడానికి ఉపక్రమించగా సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఆ అవసరం లేదని, తాను విషయాన్ని తెలుసుకొని చెబుతానని సీజేఐకి విన్నవించారు. తాను ఇక్కడే ఉన్నందున ప్రత్యేకంగా కేంద్రానికి నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదన్నారు. అయితే మంగళవారం వెలువడిన ధర్మాసనం లిఖితపూర్వక ఉత్తర్వుల్లో కేంద్రానికి నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని