బాసర సరస్వతి ఆలయంలో పునర్నిర్మాణ పనులు ప్రారంభం

బాసర ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్‌ జిల్లా బాసర సరస్వతీ ఆలయ పునర్నిర్మాణ పనులను శుక్రవారం ఆయన ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, కలెక్టర్‌ వరుణ్‌రెడ్డిలతో కలిసి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు.

Published : 25 Mar 2023 03:29 IST

యాదాద్రి తరహాలో అభివృద్ధి: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

ముథోల్‌(బాసర), న్యూస్‌టుడే: బాసర ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్‌ జిల్లా బాసర సరస్వతీ ఆలయ పునర్నిర్మాణ పనులను శుక్రవారం ఆయన ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, కలెక్టర్‌ వరుణ్‌రెడ్డిలతో కలిసి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. అనంతరం ఆలయంలో కుంకుమపూజ, మహాహారతి నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా వేదపండితులు చండీహోమం నిర్వహించారు. ఆలయం లోపల గర్భాలయ పునర్నిర్మాణానికి శిల వేసిన అనంతరం మంత్రి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆలయ పనులను ప్రారంభించినట్లు చెప్పారు. ఇప్పటికే మంజూరు చేసిన నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ విజయరామారావు, ఆర్డీఓ రవికుమార్‌, బాసర సర్పంచి లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని