చిన్న ఆలోచన.. తీర్చింది నీటి సమస్య

విద్యుత్తు సౌకర్యం లేకున్నా ఉపాయంతో బోరుబావి నుంచి నీటిని తోడి ఇంటి నిర్మాణానికి వినియోగిస్తున్నారు జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన శ్రీనివాస్‌.

Published : 27 Mar 2023 04:56 IST

ద్విచక్రవాహనంతో విద్యుత్తు మోటారు నడిపిస్తున్న వ్యక్తి

విద్యుత్తు సౌకర్యం లేకున్నా ఉపాయంతో బోరుబావి నుంచి నీటిని తోడి ఇంటి నిర్మాణానికి వినియోగిస్తున్నారు జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన శ్రీనివాస్‌. అయిలాపూర్‌ రోడ్డులో నిర్మిస్తున్న ఇంటికి విద్యుత్తు మీటరు కోసం ఆయన మీసేవలో దరఖాస్తు చేశారు. అధికారులు పరిశీలించి నూతన లైన్‌ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం రూ.4 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పడంతో శ్రీనివాస్‌ ఆందోళన చెందారు. ఇంటి నిర్మాణం కోసం తవ్వించిన బోరుబావిలో నీరు పైపైనే ఉండడంతో 0.5 హెచ్‌పీ మోటారు, పైపును అమర్చారు. ద్విచక్రవాహనం వెనకాల చక్రంతో విద్యుత్తు మోటారు చక్రం తిరిగేలా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ద్విచక్రవాహన సాయంతో బోరుబావిలోని నీటిని పైపుల ద్వారా బయటకు తోడి ఇంటి నిర్మాణానికి వినియోగిస్తున్నారు. ఇందుకు రోజూ 2 లీటర్ల పెట్రోల్‌ ఖర్చవుతుందని, 3 నెలలుగా ఈ విధంగా నీటిని వినియోగిస్తున్నట్లు శ్రీనివాస్‌ తెలిపారు.

న్యూస్‌టుడే, కోరుట్ల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని