సచివాలయ ముఖ్య భద్రతాధికారికి కమాండెంట్‌గా పదోన్నతి

సచివాలయ ముఖ్య భద్రతాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రత్యేక భద్రతా దళం(ఎస్పీఎఫ్‌) అసిస్టెంట్‌ కమాండెంట్‌ నరుకుల్ల త్రినాథ్‌కు కమాండెంట్‌గా పదోన్నతి లభించింది.

Published : 28 Mar 2023 04:25 IST

ఈనాడు, హైదరాబాద్‌: సచివాలయ ముఖ్య భద్రతాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రత్యేక భద్రతా దళం(ఎస్పీఎఫ్‌) అసిస్టెంట్‌ కమాండెంట్‌ నరుకుల్ల త్రినాథ్‌కు కమాండెంట్‌గా పదోన్నతి లభించింది. హైదరాబాద్‌ బుద్ధభవన్‌లోని ఎస్పీఎఫ్‌ ప్రధాన కార్యాలయంలో పోస్టింగ్‌ ఇచ్చారు. సోమవారం కమాండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం త్రినాథ్‌ బీఆర్కే భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారిని మర్యాదపూర్వకంగా కలిశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని