ఔషధాల ధరల పెంపు దారుణం: మంత్రి హరీశ్‌రావు

ప్రాణాలను కాపాడే మందుల ధరలను 12 శాతం పెంచడం పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యాన్ని దూరం చేసే చర్య అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

Published : 31 Mar 2023 04:08 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రాణాలను కాపాడే మందుల ధరలను 12 శాతం పెంచడం పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యాన్ని దూరం చేసే చర్య అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఔషధాల ధరలను పెంచాలని కేంద్రం నిర్ణయించడం దారుణమన్నారు. జ్వరం, ఇన్ఫెక్షన్‌లు, బీపీ, చర్మ వ్యాధులు, ఎనీమియా తదితర చికిత్సల్లో ఉపయోగించే మందులతో పాటు పెయిన్‌ కిల్లర్లు, యాంటీ బయోటిక్‌లు, యాంటీ ఇన్ఫెక్టివ్‌లు వంటి 800 రకాల మందుల ధరలు పెంచడం వల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం పడుతుందని వివరించారు. అవకాశం దొరికిన ప్రతిసారీ కేంద్ర ప్రభుత్వం ధరలను పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మంత్రి గురువారం ట్విటర్‌లో పేర్కొన్నారు. పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలను భారీగా పెంచి ప్రజల నడ్డివిరుస్తున్న కేంద్రం.. చివరకు ప్రాణాలను కాపాడుకునే మందుల్నీ వదల్లేదన్నారు. భాజపా చెబుతున్న అమృత్‌కాల్‌ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. భాజపా పాలన అచ్ఛే దిన్‌ కాదని.. సామాన్యుడు సచ్చే దిన్‌ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దేశంలో భాజపా పాలనకు రోజులు దగ్గరపడ్డాయని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని