ప్రజా శ్రేయస్సుకే ప్రాధాన్యమిచ్చిన మహనీయుడు ఎన్టీఆర్‌

సినిమా, రాజకీయరంగాల్లో నిబద్ధత కలిగిన వ్యక్తి ఎన్టీ రామారావు అని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ప్రజాశ్రేయస్సుకే అధిక ప్రాధాన్యమిచ్చిన మహనీయుడని కొనియాడారు.

Published : 26 May 2023 04:57 IST

గాంధీనగర్‌, న్యూస్‌టుడే: సినిమా, రాజకీయరంగాల్లో నిబద్ధత కలిగిన వ్యక్తి ఎన్టీ రామారావు అని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ప్రజాశ్రేయస్సుకే అధిక ప్రాధాన్యమిచ్చిన మహనీయుడని కొనియాడారు. గురువారం రాత్రి వంశీ ఇంటర్నేషనల్‌ సౌజన్యంతో శారద మ్యూజిక్‌ అకాడమీ ఆధ్వర్యంలో త్యాగరాయ గానసభలో.. నందమూరి తారకరామారావు అవార్డు ప్రదానోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణికి అవార్డును ప్రదానం చేసి మాట్లాడారు. భరణి బహుముఖ ప్రతిభాశాలి అని ప్రశంసించారు. తొలుత నిర్వహించిన సినీసంగీత విభావరి అలరించింది. కార్యక్రమంలో సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు, సరస్వతి ఉపాసకుడు దైవజ్ఞశర్మ, గాయకుడు సీహెచ్‌ త్రినాథరావు, ప్రముఖులు ప్రతాప్‌కుమార్‌, ఎంఆర్‌ చౌదరి, శారద, అచ్యుత, పద్మ, రేణుక పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని