తెలంగాణలో మరోదఫా ఓటర్ల జాబితా సవరణ

ఓటర్ల జాబితా సవరణకు ఎన్నికల సంఘం మరోదఫా కసరత్తు చేపట్టింది. జూన్‌ 23 వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తారు.

Updated : 28 May 2023 03:27 IST

వచ్చే నెల 23 వరకు ఇంటింటి సర్వే

ఈనాడు, హైదరాబాద్‌: ఓటర్ల జాబితా సవరణకు ఎన్నికల సంఘం మరోదఫా కసరత్తు చేపట్టింది. జూన్‌ 23 వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. ఆ తరువాత పోలింగు కేంద్రాలు పరిశీలించి హేతుబద్ధీకరణ ప్రక్రియ నిర్వహిస్తారు. ఆగస్టు 2న ముసాయిదా జాబితా ప్రకటన, ఆగస్టు 31 వరకు అభ్యంతరాల స్వీకరణ చేపడతారు. సెప్టెంబరు 22లోగా మార్పులు, చేర్పులకు వచ్చే దరఖాస్తులను పరిష్కరించి అక్టోబరు 10న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. అక్టోబరు 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవచ్చు అని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్ల నమోదు కోసం ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని త్వరలో ఖరారు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని