తెలంగాణ సాధనలో ఆర్టీసీది కీలక పాత్ర

తెలంగాణ సాధన ఉద్యమంలో ఆర్టీసీది కీలకపాత్ర అని, సకల జనుల సమ్మెలో సంస్థ ఉద్యోగులు ప్రధాన భూమిక పోషించారని రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనార్‌ పేర్కొన్నారు.

Published : 03 Jun 2023 05:27 IST

ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ సాధన ఉద్యమంలో ఆర్టీసీది కీలకపాత్ర అని, సకల జనుల సమ్మెలో సంస్థ ఉద్యోగులు ప్రధాన భూమిక పోషించారని రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనార్‌ పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌ ప్రాంగణంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సజ్జనార్‌ జాతీయజెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమ జీవితాలను, ఉద్యోగాలను సైతం లెక్కచేయకుండా ప్రత్యేక తెలంగాణ కోసం ఆర్టీసీ ఉద్యోగులు పోరాడారని ఆయన గుర్తుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని