పెద్దపులి సంచారంతో వట్వర్లపల్లిలో భయాందోళన

నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలంలోని వట్వర్లపల్లి సమీపంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. సమీప రైతులు, గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.

Published : 07 Jun 2023 04:38 IST

అమ్రాబాద్‌, న్యూస్‌టుడే: నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలంలోని వట్వర్లపల్లి సమీపంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. సమీప రైతులు, గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామానికి చెందిన రైతులు మంగళవారం ఉదయం పొలం పనులు చేస్తుండగా అడవి వైపు నుంచి ఓ పులి రావటాన్ని గమనించి గట్టిగా అరవడంతో కానుగులబావి చెరువుకట్ట వైపు పారిపోయింది. వెంటనే అడవిలో మేతకు వెళ్లిన తమ పశువులను వెతికి గ్రామానికి తరలించారు. మూడ్రోజులుగా గ్రామ పరిసరాల్లో పులి సంచరిస్తోందని, గ్రామానికి చెందిన ఓ పశువుపై దాడి చేసి చంపిందని గ్రామస్థులు తెలిపారు. వట్వర్లపల్లి పరిసరాల్లో సంచరిస్తున్న పెద్దపులిని ‘ఎం-22 సీజర్‌’గా గుర్తించామని దోమలపెంట రేంజ్‌ అధికారి ఆదిత్య తెలిపారు. దీనికి వయసు పైబడిందన్నారు. గ్రామస్థులెవరూ అడవి వైపు వెళ్లొద్దని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని