వధూవరులు దండలు మార్చుకుంటుండగా.. వధువు నుదుట సింధూరం దిద్దిన మాజీ ప్రియుడు
వివాహ వేదికపై చుట్టూ జనం చూస్తుండగా.. దండలు మార్చుకునేందుకు వధూవరులు సిద్ధయ్యారు. కొన్ని సెకన్లయితే దండలు మార్చుకుని వారి పెళ్లి జరిగిపోయేదే. కానీ......
ఇంటర్నెట్ డెస్క్: వివాహ వేదికపై వధూవరులు కూర్చొని ఉన్నారు. బంధువుల హడావుడి కొనసాగుతూ ఉంది. వధూవరులు ఒక్కటయ్యే ముహూర్తం రానే వచ్చింది. దండలు మార్చుకునేందుకు వారు సిద్ధమయ్యారు. అప్పుడే దూరం నుంచి వధువు ప్రియుడి గొంతు వినిపించింది.. ఆపండి అని.. అనేక సినిమాల్లో ఈ తరహా దృశ్యాలను మనం చూసే ఉంటాం. అయితే ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ పెళ్లిలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కానీ ఆ మాజీ ప్రియుడు ఆపండి అని అరవలేదు. నేరుగా వెళ్లి వధువు నుదుట సింధూరం దిద్దాడు. దీంతో అక్కడ ఉన్నవారంతా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
యూపీలోని గోరఖ్‌పుర్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో ఈ ఘటన చోటుచేసుకుంది. వేదికపై చుట్టూ జనం చూస్తుండగా.. దండలు మార్చుకునేందుకు వధూవరులు సిద్ధయ్యారు. కొన్ని సెకన్లయితే దండలు మార్చుకుని వారి పెళ్లి జరిగిపోయేదే. కానీ వధువు మాజీ ప్రియుడు వేదికపై ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాడు. వరుడు సహా అందరూ చూస్తుండగానే.. జేబులోంచి కుంకుమ తీసి ఆమె నొసటన దిద్దాడు. ఊహించని ఈ పరిణామంతో అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు. ఈ షాక్ నుంచి తేరుకొని అతడిని దొరకబుచ్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ అతడు పారిపోయాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. అయితే అర్ధాంతరంగా ఆగిపోయిన ఈ వివాహం.. మరుసటిరోజు ఉదయం జరిగినట్లు సమాచారం.
► Read latest Viral Videos and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బైక్‌పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్‌తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్