Viral video: గోల్ చేసి సంబురాలు చేసుకున్న జింక.. వైరలవుతున్న వీడియో
మైదానంలోని ఫుట్‌బాల్‌ను ఓ జింక డ్రిల్ చేసుకుంటూ వెళ్లి గోల్‌పోస్ట్‌లోకి తరలించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.....
ఇంటర్నెట్ డెస్క్: మైదానంలో ఫుట్‌బాట్ ఆడుతున్న ప్రతి క్రీడాకారుడికి గోల్ చేయాలని కోరిక ఉంటుంది. ఇక గోల్ చేస్తే ఆ సంబురాలు మిన్నంటిపోతాయి. ఇక్కడా అదే జరిగింది. కానీ గోల్ చేసింది క్రీడాకారుడు కాదు.. ఓ జింక. ఫుట్‌బాల్ ఆటను ఎక్కడ చూసిందో తెలియదు కానీ.. అచ్చూ ఫుట్‌బాల్ క్రీడాకారుడి మాదిరి ప్రవర్తించడం గమనార్హం. మైదానంలోని ఫుట్బాల్ని డ్రిల్ చేసుకుంటూ వెళ్లి గోల్‌పోస్ట్‌లోకి తరలించింది. అంతటితో ఆగకుండా గెంతుతూ సంబురాలు చేసుకోవడం విశేషం. 2019లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియోను పర్యావరణవేత్త స్టీవర్ట్ విలియమ్స్ శుక్రవారం ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ఎక్కడ జరిగింది అన్నదానిపై స్పష్టత లేదు.
ప్రస్తుతం ఈ క్లిప్పింగ్ నెట్టింట తెగ వైరలవుతోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు సంబ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. ఆ జింకకు ఫుట్‌బాట్ శిక్షణ ఎవరిచ్చారబ్బా? అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే ఈ క్లిప్పింగ్‌ను దాదాపు 26 మిలియన్ల మంది వీక్షించారు. 73వేల మంది లైక్ చేయగా.. 15వేల మంది రీ ట్వీట్ చేశారు. ఆ వీడియోను మీరూ వీక్షించండి..
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్‌తో నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్‌లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!