Spelling Bee 2022: అమెరికా ‘స్పెల్లింగ్ బీ’ పోటీల్లో మనోళ్లదే హవా.. హరిణికి టైటిల్

2022 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతికి చెందిన 14 ఏళ్ల బాలిక హరిణి లోగాన్‌ విజేతగా నిలిచింది........

Published : 04 Jun 2022 01:37 IST

వాషింగ్టన్‌: అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ స్పెల్లింగ్‌ బీ పోటీల్లో ఈ ఏడాది కూడా భారత సంతతికి చెందిన విద్యార్థుల ఆధిపత్యం కొనసాగింది. 2022 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతికి చెందిన 14 ఏళ్ల బాలిక హరిణి లోగాన్‌ విజేతగా నిలిచింది. ‘charadriiform’, ‘sereh’, ‘moorhen’ సహా 21 పదాల స్పెల్లింగ్‌లను తప్పుల్లేకుండా చెప్పిన హరిణి స్క్రిప్స్‌ కప్‌ను చేజిక్కించుకుంది. దీంతో ఆమెకు 50 వేల డాలర్ల ప్రైజ్‌ మనీ దక్కింది. ఈ పోటీల్లో మొదటిసారి టై బ్రేకర్‌ను ప్రవేశపెట్టగా.. ఇందులో హరిణి విజయం సాధించింది. హరిణి కుటుంబం టెక్సాస్‌లో సాన్‌ ఆంటోనియో ప్రాంతంలో స్థిరపడడా.. ప్రస్తుతం ఆమె 8వ గ్రేడ్‌ చదువుతోంది.

ఈ పోటీల్లో విక్రమ్‌ రాజుకు రెండో స్థానం దక్కింది. 90 సెకన్లలో హరిణి 26 పదాలకుగాను 21 పదాలకు సరైన స్పెల్లింగ్‌ చెప్పగా.. 12 ఏళ్ల విక్రమ్‌ రాజు 19 పదాల్లో 15 పదాలకు సరైన స్పెల్లింగ్‌ చెప్పాడు. ఈ పోటీల్లో విహాన్‌ సిబల్‌ 3వ స్థానంలో నిలువగా, ఉప్పల సహర్ష్‌కు నాలుగో స్థానం దక్కింది. 1925 నుంచి జాతీయ స్పెల్లింగ్‌ బీ పోటీలు నిర్వహిస్తున్నారు. అమెరికా జనాభాలో భారత సంతతి అమెరికన్లు ఒక్క శాతమే అయినప్పటికీ గత 20 ఏళ్లుగా స్పెల్లింగ్‌ బీ పోటీల్లో వీరి ఆధిపత్యం కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని