Ukraine Crisis: పాఠశాల షెల్టర్‌ భవనంపై బాంబింగ్‌: 60 మంది మృతి..?

లుహాన్స్క్‌ ప్రాంతంలోని ఓ పాఠశాల షెల్టర్‌ భవనంపై జరిగిన బాంబుదాడిలో దాదాపు 60 మంది మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. దాడి జరిగిన సమయంలో

Published : 08 May 2022 16:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌కు చెందిన లుహాన్స్క్‌ ప్రాంతంలోని ఓ పాఠశాల షెల్టర్‌ భవనంపై జరిగిన బాంబుదాడిలో దాదాపు 60 మంది మృతి చెందినట్లు సమాచారం. దాడి జరిగిన సమయంలో షెల్టర్‌లో దాదాపు 90 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై లుహాన్స్క్‌ ప్రాంతా మిలిటరీ అడ్మినిస్ట్రేషన్‌ అధిపతి సెర్హీ హేడె మాట్లాడుతూ.. దాడి తర్వాత శిథిలాల నుంచి 30 మందిని రక్షించినట్లు వెల్లడించారు. వీరిలో ఏడుగురు గాయపడ్డారని పేర్కొన్నారు. ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. శిథిలాల కింద మరో 60 మంది వరకూ ఉండొచ్చని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా శిథిలాలను తొలగిస్తామని పేర్కొన్నారు. వీటికింద ఉన్నవారు బతికే అవకాశాలు చాలా తక్కువని చెప్పారు.

రష్యాకు చెందిన విమానం ఈ భవనంపై బాంబును జార విడిచింది. దాడికి గురైన పాఠశాల సరిహద్దులకు కేవలం ఏడు మైళ్ల దూరంలో ఉంది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 4.30 గంటల సమయాంలో ఈ దాడి జరిగింది. అనంతరం దాదాపు నాలుగు గంటలపాటు అగ్నికీలలు ఎగసిపడ్డాయి.

బ్రిటన్‌ నుంచి ఉక్రెయిన్‌కు 1.6 బిలియన్‌ డాలర్ల సైనిక సాయం..

బ్రిటన్‌ నుంచి ఉక్రెయిన్‌కు మరో 1.6 బిలియన్‌ డాలర్ల సైనిక సాయం అందనుంది. ఈ విషయాన్ని బ్రిటన్‌ ట్రెజరీ విభాగం ఆదివారం వెల్లడించింది. వర్చువల్‌ జీ-7 సదస్సుకు ముందు ఈ సాయం ప్రకటించారు. జీ-7 సదస్సుకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హాజరు కానున్నారు. అఫ్గానిస్థాన్‌, ఇరాక్‌ యుద్ధం తర్వాత బ్రిటన్‌ ఈ స్థాయిలో కేటాయింపులు చేయడం ఇదే తొలిసారి. గత వారం ఉక్రెయిన్‌కు 300 మిలియన్‌ డాలర్ల సైనిక సాయం చేస్తామని  బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని