China: విద్యార్థులకు బహుమతిగా పందులు.. వాణిజ్యాభివృద్ధికేనట!

సాధారణంగా పాఠశాలల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిస్తే మెడల్స్‌, పుస్తకాలు, చదువుకు ఉపయోగపడే ఇతర వస్తువుల్ని బహుమతిగా ఇస్తుంటారు. కానీ, చైనాలోని ఓ పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు పందుల్ని బహుమతిగా ఇస్తోంది. దీని వెనుక గ్రామీణ వాణిజ్యంలో వృద్ధి సాధించాలనే

Published : 16 Jan 2022 03:57 IST

బీజింగ్‌: సాధారణంగా పాఠశాలల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిస్తే మెడల్స్‌, పుస్తకాలు, చదువుకు ఉపయోగపడే ఇతర వస్తువుల్ని బహుమతిగా ఇస్తుంటారు. కానీ, చైనాలోని ఓ పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు పందుల్ని బహుమతిగా ఇస్తోంది. దీని వెనుక గ్రామీణ వాణిజ్యంలో వృద్ధి సాధించాలనే దీర్ఘకాలిక లక్ష్యముందని పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు.

యునాన్‌ ప్రావిన్స్‌ ఇలియాంగ్‌ ప్రాంతంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 20 మంది విద్యార్థులకు పందుల్ని బహుమతిగా ఇస్తున్న వీడియో చైనీస్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై స్పందించిన ఆ పాఠశాల యాజమాన్యం ‘‘గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. వారిలో కష్టపడుతూ చదువుకుంటున్న ప్రతిభ గల విద్యార్థులకు పందుల్ని బహుమతిగా ఇస్తూ వారికి, వారి కుటుంబాలకు చేయూతని అందిస్తున్నాం. వీటి ద్వారా వెంటనే లాభాలు రాకపోవచ్చు. కానీ, వీటి పెంపకంతో భవిష్యత్తులో లాభాలు(పందుల పెంపకం వ్యాపారం చేయొచ్చు. లేదా ఆ పందిని కొంతకాలం పెంచి విక్రయించుకోవచ్చు) గడించొచ్చు. ఆ డబ్బుతో చిన్నారుల చదువుకు అవసరమయ్యే పుస్తకాలు, వస్తువుల్ని తల్లిదండ్రులు కొనుగోలు చేస్తారు. మార్కెట్‌లో లావాదేవీలు జరుగుతాయి. విద్యార్థులు కూడా బహుమతి దక్కించుకోవాలని మరింత బాగా చదువుతారు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో చదువు, వాణిజ్యం రెండు అభివృద్ధి చెందుతాయి’’అని ఉపాధ్యాయులు తెలిపారు. భలే వింతయినా, తెలివైనా ఆలోచన కదా..! 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని