Ukraine Crisis: చర్చల వద్ద ఏమీ తినొద్దు.. తాగొద్దు..!

టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరుగుతున్న చర్చల వేదిక వద్ద ఏమి తినడం, తాగడం వంటివి చేయవద్దని శాంతి చర్చల దూతలను ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా హెచ్చరించారు.

Updated : 29 Mar 2022 20:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టర్కీలోని ఇస్తాంబుల్‌ నగరంలో జరుగుతున్న చర్చల వేదిక వద్ద ఏమి తినడం, తాగడం వంటివి చేయవద్దని తమ దూతలను ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబ హెచ్చరించారు. ‘‘రష్యన్‌ ఫెడరేషన్‌తో చర్చలకు  వెళుతున్న వారిని ఒక్క విషయంలో హెచ్చరిస్తున్నా. అక్కడ తినడం, తాగడం వంటివి చేయవద్దు.. వీలైనంత వరకు ఎటువంటి వస్తువులను తాకవద్దు’’ అంటూ దిమిత్రి కులేబ పేర్కొన్నారు. ఆయన జాతీయ టీవీలో వచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఈ నెల మొదట్లో జరిగిన చర్చల సమయంలో రష్యా ధనికుడు రోమన్‌ అబ్రహమోవిచ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన కంటి చూపు కొద్దిసేపు పాక్షికంగా దెబ్బతింది. ఆ తర్వాత ఆయన వేగంగా కోలుకొన్నారు. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌ విజ్ఞప్తికి అంగీకరించి.. సాయం చేసేందుకు వచ్చారు. వాస్తవానికి ఆయన చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడగల సమర్థుడు. ఈ చర్చల్లో అదే చాలా కీలకం కానుంది. ఈ నేపథ్యంలో అబ్రహమోవిచ్‌ పై విషప్రయోగం జరగడం ఉక్రెయిన్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని