Afghanistan: అఫ్గాన్‌లో భారీ భూకంపం.. 255 మంది మృతి..!

అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. తూర్పు పక్టికా ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో సంభవించిన ఈ భూకంప ధాటికి కనీసం 155 మంది మృతిచెందినట్లు అఫ్గాన్‌ అధికారిక మీడియా సంస్థ వెల్లడించింది. అయితే

Updated : 22 Jun 2022 12:47 IST

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. తూర్పు పక్టికా ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో సంభవించిన ఈ ప్రకంపనల ధాటికి కనీసం 255 మంది మృతిచెందినట్లు అఫ్గాన్‌ అధికారిక మీడియా సంస్థ వెల్లడించింది. వందల మంది గాయపడ్డారు. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. అఫ్గాన్‌లోని ఖోస్ట్‌ నగరానికి 44 కిలోమీటర్ల దూరంలో 51 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది.

భూకంపం ధాటికి పలు భవనాలు నేలమట్టమయ్యాయి. అర్ధరాత్రి సమయంలో పలుమార్లు ప్రకంపనలు చోటుచేసుకోవడంతో అనేక మంది శిథిలాల కింద చిక్కుకుని మరణించినట్లు అధికారులు తెలిపారు. భూకంపం సంభవించిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

పాక్‌లోనూ ప్రకంపనలు..

అటు పాకిస్థాన్‌లోనూ పలు చోట్ల ప్రకంపనలు సంభవించాయి. పెషావర్‌, ఇస్లామాబాద్‌, లాహోర్‌, ఖైబర్‌ పఖ్తుంఖ్వా, పంజాబ్ ప్రావిన్స్‌లలో పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం చోటుచేసుకోలేదని పాక్‌ అధికారులు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని