Ukraine Crisis: రష్యాకు మరో తలనొప్పి.. నాటో దిశగా ఫిన్లాండ్‌ అడుగులు..!

నార్డిక్‌ దేశమైన ఫిన్లాండ్‌ నాటో కూటమిలో చేరేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఆ దేశ అధ్యక్షుడు సౌలి నిన్నిస్టో, ప్రధాని సన్నామారిన్‌లు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాటోలో

Published : 13 May 2022 02:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నార్డిక్‌ దేశమైన ఫిన్లాండ్‌ నాటో కూటమిలో చేరేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఆ దేశ అధ్యక్షుడు సౌలి నిన్నిస్టో, ప్రధాని సన్నామారిన్‌లు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాటోలో చేరేందుకు దరఖాస్తు చేయడానికి సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. రానున్న మరికొన్ని రోజుల్లో నిర్ణయం వెలువడుతుందని వెల్లడించారు. నాటో సభ్యత్వంతో ఫిన్లాండ్‌ భద్రత మరింత బలపడుతుందని వెల్లడించారు. ఫిన్లాండ్‌ చేరికతో నాటో కూటమి కూడా బలోపేతం అవుతుందని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. 

ఫిన్లాండ్‌ పార్లమెంట్‌, సీనియర్‌ రాజకీయ నాయకులు పరిశీలించిన తర్వాత ఆదివారం నాటో అంశంపై ఓ ప్రకటన చేయనుంది. అదే రోజు స్వీడన్‌ కూడా నాటోలో చేరికపై ఓ నిర్ణయం వెలువరించనుంది. మరోపక్క రష్యా దీనిపై మండిపడుతోంది. ఎటువంటి సైనిక కూటముల్లో చేరకుండా తటస్థంగా ఉండటంపై కొన్ని దశాబ్దాలుగా ఉన్న పాలసీని వీడితే తీవ్ర పరిణమాలు తప్పవని స్వీడన్‌, ఫిన్లాండ్‌లను ఇప్పటికే రష్యా హెచ్చరించింది. 

ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత ఫిన్లాండ్‌లో నాటోలో చేరికపై ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. ఫిన్లాండ్‌ 1,300 కిలోమీటర్ల సరిహద్దులను రష్యాతో పంచుకొంటోంది. ఇప్పటి వరకు రష్యాతో విరోధం వద్దునుకొని నాటోలో చేరలేదు. నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టాలెన్‌ బర్గ్‌ మాట్లాడుతూ వీలైనంత త్వరంగా స్వీడన్‌, ఫిన్లాండ్‌ సభ్యత్వం ప్రాసెసింగ్‌ పూర్తవుతుందన్నారు. 

ఇప్పటికే ఫిన్లాండ్‌లో నిర్వహించిన ఒక ప్రజాభిప్రాయ సేకరణలో దాదాపు 76శాతం మంది నాటోలో చేరేందుకు మొగ్గు చూపారు. రష్యా ఉక్రెయిన్‌పై దండెత్తిన తరువాత ఫిన్లాండ్‌ ప్రజల అభిప్రాయాల్లో మార్పు వచ్చింది.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని