Crime News: ఆర్‌బీఐలో డబ్బు ఫ్రీజయిందంటూ.. కట్టుకథ

‘కెనడాకు చెందిన ఓ సంస్థకు విలువైన ఖనిజం అమ్మటం ద్వారా రూ.55,000 కోట్లు వచ్చాయి.

Updated : 09 Jan 2022 12:17 IST

 

ముంబయి: ‘కెనడాకు చెందిన ఓ సంస్థకు విలువైన ఖనిజం అమ్మటం ద్వారా రూ.55,000 కోట్లు వచ్చాయి. ఆర్‌బీఐ వద్ద ఆ సొమ్ము ఫ్రీజయింది. పన్ను కట్టేందుకు రూ.27 కోట్లు కావాలి. ఆ నగదు సమకూరిస్తే 40 శాతం షేర్‌ ఇస్తాం’ అంటూ కొందరు ఓ మహిళను మోసం చేశారు. ముంబయిలో జరిగిన ఈ కుట్ర బయటపడి, పోలీసులు నలుగురిని అరెస్ట్‌ చేశారు. ఈ నెల 5వ తేదీన బాధిత మహిళ.. భాస్కరరావు యోసుపోగు అనే వ్యక్తిని జుహు ప్రాంతంలోని ఓ హోటలులో కలిసింది. అతడి కట్టుకథను పూర్తిగా నమ్మిన ఆమె.. తన వద్ద ఉన్న రూ.30,000 ఇచ్చింది. మిగిలిన డబ్బు గురువారం ఇస్తానని చెప్పింది. ఈలోపు స్నేహితులు హెచ్చరించడంతో పోలీసులను ఆశ్రయించింది. భాస్కరరావు సహా మరో ముగ్గురు.. బోగస్‌ పత్రాలు సృష్టించి ఆర్‌బీఐ, డీఆర్‌డీవో, రక్షణశాఖ, బార్క్, ఇస్రో, రా విభాగాలతో తమకు సంబంధాలు ఉన్నాయంటూ అమాయకులను మోసం చేస్తున్నట్లు పోలీసులు తేల్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని