H1b Visa: మార్చి 1 నుంచి హెచ్‌1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ

భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే హెచ్‌1బీ వీసాల దరఖాస్తు ప్రక్రియ మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది.

Updated : 30 Jan 2023 09:35 IST

వాషింగ్టన్‌: భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే హెచ్‌1బీ వీసాల దరఖాస్తు ప్రక్రియ మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఈ వీసాలు జారీ చేయనున్నారు. ‘మార్చి 17లోపు రావాల్సినన్ని దరఖాస్తులు వచ్చేస్తే.. లాటరీ ద్వారా ఎంపిక చేసి వీసాలు జారీ చేస్తాం. ఒకవేళ రాకపోతే పక్కాగా రిజిస్ట్రేషన్లు సమర్పించిన అందరికీ వీసాలు ఇస్తాం.’ అని యూఎస్‌ పౌరసత్వ, ఇమిగ్రేషన్‌ సేవల (యూఎస్‌సీఐఎస్‌) సంస్థ ప్రకటించింది. సంవత్సరానికి 85 వేల హెచ్‌1బీ వీసాలను అమెరికా జారీ చేస్తుంది. ఇందులో 20 వేల వీసాలను తమ దేశంలో అడ్వాన్స్‌ డిగ్రీలు చేసిన వారికి మాత్రమే ఇస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని