సంక్షిప్త వార్తలు

భారత్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్‌ గార్సెట్టి శుక్రవారం అధికారికంగా ప్రమాణస్వీకారం చేశారు. ఓ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ఆయనతో ప్రమాణం చేయించారు.

Updated : 25 Mar 2023 06:25 IST

భారత్‌లో అమెరికా రాయబారిగా ప్రమాణస్వీకారం చేసిన గార్సెట్టి

వాషింగ్టన్‌: భారత్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్‌ గార్సెట్టి శుక్రవారం అధికారికంగా ప్రమాణస్వీకారం చేశారు. ఓ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. కొత్త బాధ్యతలు నిర్వర్తించడానికి వేచిచూడబోనని ఈ సందర్భంగా గార్సెట్టి స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గార్సెట్టి భార్య అమీ వేక్‌లాండ్‌, తండ్రి గిల్‌ గార్సెట్టి, తల్లి సుకీ గార్సెట్టి తదితరులు హాజరయ్యారు.


భారత్‌లో ప్రజాస్వామ్యంపై ఐరాస చీఫ్‌ ఆందోళన!

ఐక్యరాజ్యసమితి: భారత్‌లో ప్రజాస్వామ్యం పట్ల ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ఆందోళనతో ఉన్నారని ఆయన ప్రతినిధి ఫర్హాన్‌ హక్‌ శుక్రవారం నాడిక్కడ తెలిపారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి జైలుశిక్ష, తదనంతర పరిణామాలు గుటెరెస్‌ దృష్టికి వచ్చాయని ఆయన వివరించారు. దీనిపై ప్రస్తుతానికి ఇంతకుమించి వ్యాఖ్యలు చేయలేనన్నారు.


సిరియాపై అమెరికా దాడులు

బీరుట్‌: డ్రోన్‌ దాడిలో తమ దేశ కాంట్రాక్టర్‌ చనిపోవడం, ఐదుగురు సైనికులు గాయడడంతో..  అమెరికా ప్రతీకారం తీర్చుకుంది. సిరియాపై వైమానిక దాడులు జరిపింది. ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డులకు అనుబంధంగా సిరియాలో పనిచేస్తున్న గ్రూపుల స్థావరాలు లక్ష్యంగా యుద్ధ విమానాల ద్వారా క్షిపణులు ప్రయోగించింది. తమ దేశస్థులపై దాడికి ఇరాన్‌ తయారీ డ్రోన్‌ కారణమని అమెరికా బలంగా విశ్వసిస్తోంది.


రష్యా దాడుల్లో 10 మంది మృతి

కీవ్‌: రష్యా దీర్ఘశ్రేణి క్షిపణులు చేసిన దాడుల్లో శుక్రవారం పది మంది మృతి చెందారని, ఇందులో ఐదుగురు డొనెట్స్క్‌ ప్రావిన్స్‌లోని కొస్తయాంటినివికాలో ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్‌ అధ్యక్ష కార్యాలయం పేర్కొంది. రానున్న వారాల్లో ఊహించని దాడులకు మాస్కో తెగబడొచ్చని హెచ్చరించింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు