హర్మోజ్‌ జలసంధిలో వాణిజ్య నౌకను వేధించిన ఇరాన్‌ సైన్యం: అమెరికా

హర్మోజ్‌ జలసంధిలో ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్‌ (సైన్యం) ఓ నౌకను వేధింపులకు గురిచేసిన సందర్భంగా దానికి తమ దేశ నావికులు, బ్రిటన్‌కు చెందిన రాయల్‌ నేవీ సహాయం చేసినట్లు అమెరికా నౌకా దళం సోమవారం వెల్లడించింది.

Published : 06 Jun 2023 04:25 IST

దుబాయ్‌: హర్మోజ్‌ జలసంధిలో ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్‌ (సైన్యం) ఓ నౌకను వేధింపులకు గురిచేసిన సందర్భంగా దానికి తమ దేశ నావికులు, బ్రిటన్‌కు చెందిన రాయల్‌ నేవీ సహాయం చేసినట్లు అమెరికా నౌకా దళం సోమవారం వెల్లడించింది. ఆదివారం మధ్యాహ్నం ఓ వాణిజ్య నౌకను ఇరాన్‌కు చెందిన సాయుధులు గల మూడు చిన్న నౌకలు చుట్టుముట్టాయని తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన ఛాయా చిత్రాలను బయటపెట్టింది. అమెరికా నౌకా దళానికి చెందిన గైడెడ్‌ మిస్సైల్‌ డిస్ట్రాయర్‌ యూఎస్‌ఎస్‌ మెక్‌ఫౌల్‌, బ్రిటన్‌ రాయల్‌ నేవీకి చెందిన హెచ్‌ఎంఎస్‌ లాంకెస్టర్‌ తక్షణం స్పందించాయని వివరించింది. దీంతో ఇరాన్‌ చిన్న నౌకలు అక్కడ నుంచి వెళ్లిపోయాయని ఆపై ఆ వాణిజ్య నౌక హర్మోజ్‌ జలసంధిలో ఎటువంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగిపోయిందని అమెరికా నౌకాదళం వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు