వర్జీనియా స్కూల్‌ వేడుకలో కాల్పులు

వర్జీనియా రాజధాని రిచ్‌మండ్‌లో మంగళవారం సాయంత్రం ఓ హైస్కూలు గ్రాడ్యుయేషన్‌ డే ముగిసి, థియేటరు నుంచి బయకు వచ్చిన జనం, విద్యార్థులు  బంధుమిత్రులతో ఫొటోలు దిగుతుండగా కాల్పులు జరిగాయి.

Published : 08 Jun 2023 04:34 IST

ఇద్దరి మృతి

రిచ్‌మండ్‌: వర్జీనియా రాజధాని రిచ్‌మండ్‌లో మంగళవారం సాయంత్రం ఓ హైస్కూలు గ్రాడ్యుయేషన్‌ డే ముగిసి, థియేటరు నుంచి బయకు వచ్చిన జనం, విద్యార్థులు  బంధుమిత్రులతో ఫొటోలు దిగుతుండగా కాల్పులు జరిగాయి. ఏడుగురు వ్యక్తులను తుపాకీ గుళ్లు తాకగా, వారిలో 18.. 36 ఏళ్ల ఇద్దరు పురుషులు మృతిచెందారు. హఠాత్పరిణామంతో బిత్తరపోయిన జనం భయంతో అటూ ఇటూ పరుగులు తీశారు. ఈ తొక్కిసలాటలో మరో 12 మంది గాయపడ్డారు. కాల్పుల అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించిన ఓ అనుమానిత యువకుణ్ని (19) అరెస్టు చేసినట్లు రిచ్‌మండ్‌ పోలీసులు తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు