పాకిస్థాన్‌లో ఎన్నికల నగారా

పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ  ప్రస్తుత పదవీకాలం ముగియడానికి మూడు రోజుల ముందే.. దానిని రద్దుచేసి ఎన్నికలు జరిపించాలని ఈ నెల 9న సిఫార్సు చేస్తానని ఆ దేశ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ తెలిపారు.

Published : 05 Aug 2023 04:39 IST

9న జాతీయ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేయనున్నట్లు ప్రధాని షెహబాజ్‌ వెల్లడి

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ  ప్రస్తుత పదవీకాలం ముగియడానికి మూడు రోజుల ముందే.. దానిని రద్దుచేసి ఎన్నికలు జరిపించాలని ఈ నెల 9న సిఫార్సు చేస్తానని ఆ దేశ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ తెలిపారు. తన సంకీర్ణ ప్రభుత్వ భాగస్వాములతో గురువారం జరిపిన విందు సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌పై దేశాధ్యక్షుడు సంతకం చేయగానే జాతీయ అసెంబ్లీ రద్దవుతుందన్నారు. ఒకవేళ అధ్యక్షుడు సంతకం చేయకపోతే ప్రధాని నోటిఫికేషన్‌ జారీచేసిన 48 గంటల్లో సభ రద్దయిపోతుంది. ఆపైన 90 రోజుల్లో ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. తన పెద్దన్న, మాజీ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ త్వరలో లండన్‌ నుంచి పాకిస్థాన్‌కు తిరిగివస్తారని షెహబాజ్‌ తెలిపారు. తమ పార్టీ అయిన పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ (నవాజ్‌) వచ్చే ఎన్నికల్లో గెలిస్తే, నవాజ్‌ షరీఫే కొత్త ప్రధానిగా పగ్గాలు చేపడతారని వివరించారు. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం కారణంగా కూలిపోగా నిరుడు ఏప్రిల్‌లో షెహబాజ్‌ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం పగ్గాలు చేపట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని