Elon Musk: కాలేజ్‌కు వెళ్లేది చదువుకోవడానికి కాదట..!

వ్యాపారవేత్త ఎలాన్‌ మస్క్‌(Elon Musk) తన అభిప్రాయాలను సూటిగా చెప్పేస్తుంటారు. తాజాగా కాలేజ్‌ విద్య గురించి మాట్లాడిన వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. 

Published : 27 Jan 2023 11:23 IST

ముంబయి: కాలేజ్‌కు వెళ్లేది చదువుకోవడానికి కాదట..! ఈ మాట అన్నది టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌(Elon Musk). ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా(Harsh Goenka) ట్విటర్‌లో పంచుకున్నారు. 

‘మీరు కొత్త విషయాలు తెలుసుకునేందుకు కాలేజ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. మీకు ప్రతిదీ ఉచితంగానే లభిస్తుంది. మీకు కావాల్సిందేదైనా ఉచితంగానే నేర్చుకోవచ్చు. కాలేజ్‌కు వెళ్లేది నేర్చుకోవడానికి కాదు. సరదా కోసం, మీ పనులు మీరు చేసుకోగలరని నిరూపించుకునేందుకని నా అభిప్రాయం’ అంటూ మస్క్‌ ఓ వీడియో క్లిప్‌లో మాట్లాడారు. గోయెంకా ఈ వీడియోను షేర్ చేసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు మస్క్‌(Elon Musk) చెప్పింది రైట్‌ అని, డిగ్రీ కోసమే కాలేజ్‌ అంటూ వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి విజయవంతమయ్యాడని.. అతడు చెప్పే ప్రతిసలహా పరిగణించాల్సిన పనిలేదని మరికొందరు ఘాటుగా స్పందించారు. మస్క్‌ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి బ్యాచ్‌లర్‌ డిగ్రీ పొందారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని