Pandemic: వచ్చే పదేళ్లలో మరో కొవిడ్ తరహా మహమ్మారి.. హెచ్చరించిన పరిశోధన సంస్థ
Pandemic: వివిధ కారణాల వల్ల వచ్చే దశాబ్ద కాలంలో మరో మహమ్మారి వెలుగులోకి వచ్చే ప్రమాదం ఉందని లండన్‌కు చెందిన ఓ పరిశోధన సంస్థ తెలిపింది. వేగంగా వ్యాక్సిన్లను ఆవిష్కరించడం వల్ల వాటిని అడ్డుకోవచ్చని పేర్కొంది.
లండన్: ప్రపంచాన్ని కరోనా వైరస్ (Coronavirus) అతలాకుతలం చేసింది. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి (Pandemic) లక్షలాది మందిని పొట్టనబెట్టుకుంది. ఇప్పటికీ ప్రపంచంలో ఏదో ఒక మూల కొత్త రూపం సంతరించుకొని మానవాళిని భయపెడుతూనే ఉంది. అయితే, లండన్ కేంద్రంగా జరిగిన ఓ తాజా పరిశోధన మరో ఆసక్తికర అంశాన్ని వెలుగులోకి తెచ్చింది. వచ్చే పదేళ్లలో కొవిడ్ తరహా మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని చుట్టుముట్టే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
వచ్చే దశాబ్ద కాలంలో దాదాపు కరోనా వైరస్‌కు ఉన్నంత తీవ్రతతో మరో మహమ్మారి (Pandemic) వచ్చే అవకాశం 27.5% ఉన్నట్లు ఆరోగ్య విశ్లేషణా సంస్థ ‘ఎయిర్‌ఫినిటీ లిమిటెడ్’ వెల్లడించింది. వాతావరణ మార్పులు, అంతర్జాతీయ ప్రయాణాలు పెరగడం, జనాభా పెరుగుదల, జంతువుల నుంచి మనుషులకు సోకే సామర్థ్యం ఉన్న కొత్త వ్యాధులు పుట్టుకు రావడం వంటి కారణాలు అందుకు దోహదం చేస్తాయని పేర్కొంది. అయితే, 100 రోజుల్లోగా సమర్థమైన వ్యాక్సిన్లను ఆవిష్కరించగలిగితే.. వాటిని నివారించే అవకాశం ఉంటుందని తెలిపింది.
మనిషి నుంచి మనిషికి వ్యాపించేలా పరివర్తన చెందగలిగే అవకాశం ఉన్న బర్డ్‌ఫ్లూ తరహా వైరస్‌లు వెలుగులోకి వస్తే.. యూకేలో ఒకే రోజు 15,000 మంది మరణించే ప్రమాదం ఉంటుందని ఎయిర్‌ఫినిటీ తెలిపింది. భారత్‌లో ఇప్పటికే సార్స్, మెర్స్, కొవిడ్-19 (Covid-19) మహమ్మారు (Pandemic)లు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా హెచ్5ఎన్1 బర్డ్‌ఫ్లూ స్ట్రెయిన్ ఆందోళన కలిగిస్తోంది. అయితే, ఇప్పటి వరకు దీనివల్ల చాలా తక్కువ మంది మాత్రమే అనారోగ్యానికి గురయ్యారు. అలాగే ఇది ఒక మనిషి నుంచి మరో మనిషికి వ్యాప్తిస్తున్నట్లు ఇప్పటి వరకు ఆధారాలు లేవు. అయితే, పక్షుల్లో వేగంగా వ్యాప్తి చెందడం, క్షీరదాలకూ వ్యాప్తిస్తుండడం ఇప్పుడు పరిశోధకులను కలవరపెడుతోంది. పరివర్తనలు ఇలాగే కొనసాగితే.. వేగంగా వ్యాపించేలా వైరస్ రూపాంతరం చెందే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.
మెర్స్, జికా వంటి వ్యాధులకు కారణమవుతున్న వైరస్‌లను నిలువరించేందుకు ఇప్పటి వరకు నిర్దిష్టమైన టీకాలు, చికిత్స విధానాలు అందుబాటులో లేవని ఎయిర్‌ఫినిటీ గుర్తు చేసింది. అలాగే ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాల వల్ల కొత్త వైరస్‌ల ముప్పును వెంటనే పసిగట్టడం అంత సులభం కాదని పేర్కొంది. ఈ నేపథ్యంలో మరో కొత్త మహమ్మారి (Pandemic)ని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సన్నద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
GST collections: సెప్టెంబరు జీఎస్టీ వసూళ్లు రూ.1.62 లక్షల కోట్లు.. 10% వృద్ధి
-
Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Rohit Sharma: నా దృష్టిలో అతడే కఠినమైన బౌలర్: రోహిత్ శర్మ
-
PM Modi: తెలంగాణలో వచ్చే ఎన్నికల తర్వాత చెప్పింది చేసే ప్రభుత్వం: ప్రధాని మోదీ
-
TMC: దిల్లీలో మాపై లాఠీలు విరిగితే.. పశ్చిమబెంగాల్లోనూ విరుగుతాయ్ : బెంగాల్ మంత్రి పార్థ భౌమిక్
-
Linda Yaccarino:‘ఎక్స్’రోజువారీ యాక్టివ్ యూజర్లను కోల్పోతోంది: లిండా యాకారినో